నితిన్ సినిమాకు పాత టైటిల్

నితిన్ నటిస్తున్న ఓ సినిమాకు భీష్మ అనే టైటిల్ పెట్టారు. మరో సినిమాకు రంగ్ దే అనే టైటిల్ పెట్టారు. ఇక నితిన్ చేస్తున్న మూడో సినిమాకు ఓ పాత టైటిల్ ను పరిశీలిస్తున్నారు.…

నితిన్ నటిస్తున్న ఓ సినిమాకు భీష్మ అనే టైటిల్ పెట్టారు. మరో సినిమాకు రంగ్ దే అనే టైటిల్ పెట్టారు. ఇక నితిన్ చేస్తున్న మూడో సినిమాకు ఓ పాత టైటిల్ ను పరిశీలిస్తున్నారు. అవును.. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమాకు చదరంగం అనే టైటిల్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. కథకు ఇది అతికినట్టు సరిపోతుంది కాబట్టి, ఇదే టైటిల్ పెట్టాలని దాదాపు ఫిక్స్ అయ్యారు.

చదరంగం టైటిల్ అంటే ఇదేదో జీవన చదరంగం లాంటి సినిమా అనుకోవద్దు. నిజంగానే చదరంగం ఆటకు సంబంధించిన సినిమా ఇది. ఈ సినిమాలో ఛెస్ గేమ్ ఉంటుంది. సినిమాలో నితిన్ జీవితానికి, ఈ గేమ్ కు చాలా దగ్గర సంబంధం ఉంటుందట. అందుకే కథకు జస్టిఫికేషన్ గా చదరంగం అనే టైటిల్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నారు.

చంద్రశేఖర్ ఏలేటి కథలన్నీ భిన్నంగా ఉంటాయి. ఈ సినిమా కథ కూడా అందుకు అతీతం కాదు. చదరంగం ఆటతో పాటు క్రైమ్, లవ్ ఎలిమెంట్స్ కలబోతగా ఈ సినిమా వస్తోంది. మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలవుతుంది. సినిమాలో నితిన్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా, రెండో హీరోయిన్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రియాప్రకాష్ వారియర్ కనిపిస్తుంది. 

అల్లువారింట్లో సైరా పార్టీ.. అక్కినేని హీరో కూడా