ఇలాంటి సినిమా ఈ మధ్య రాలేదు

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో తయారైన సినిమా ‘మహా సముద్రం’. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో…

శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో తయారైన సినిమా ‘మహా సముద్రం’. ఆర్ ఎక్స్ 100 లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు

మహా సముద్రం ఎంతో ఇంటెన్స్ ఎమోషన్స్ ఉన్న సినిమా. ఈ  చిత్రం చూసిన ప్రేక్షకులు కచ్చితంగా ఓ మౌనంతో, బరువెక్కిన హృదయాలతో బయటకు వెళ్తారు. చివరి 40 నిమిషాలు ఎవ్వరూ ఏం మాట్లాడకుండా సినిమా చూస్తారు. మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో అదే మహాసముద్రం. అమాయకపు మనుషుల జీవిత కథలే ఇందులో కనిపిస్తాయి. 

మ్యూజిక్ అనేది కథకు అనుగుణంగానే ఇస్తాను. కథ బాగుంటే.. మ్యూజిక్ కూడా బాగుంటుంది. కథను బట్టే మ్యూజిక్ ఇస్తాను. ఆర్ఎక్స్ 100 సినిమాలో కంటే ఎక్కువ ట్విస్ట్‌లు మహాసముద్రంలో ఉంటాయి. ఇందులో దాదాపు ఐదారు ట్విస్ట్‌లుంటాయి. అందులో  ఒకే ఎమోషన్ ఉంటుంది. కానీ ఇందులో మల్టిపుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఒక అతీంద్రియ శక్తి మనిషిని ఎన్నిరకాలుగా మార్చుతుంది.. టైం, విధి మనిషిని ఎన్ని రకాలుగా మార్చుతుందనేది చూపించబోతోన్నాం.

ఆర్ఎక్స్ 100 సినిమాకు చేసిన ప్రయోగాన్ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్నారు. బాగా ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాకు ఒళ్లు దగ్గరపెట్టుకుని మరింత జాగ్రత్తగా చేశాను. కచ్చితంగా మహాసముద్రం కూడా అందరినీ ఆకట్టుకుంటుంది.

మహా అనే క్యారెక్టర్ చాలా ఇంటెన్స్‌గా ఉంటుంది. ఆమె జీవితంలో జరిగే ఘటనల ద్వారా చుట్టూ ఉన్న వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది కథ.  మహా సముద్రం సినిమాలో నాకు చెప్పకే చెప్పకే అనే పాట ఎక్కువగా ఇష్టం. మంచి మూమెంట్‌లో ఆ పాట వస్తుంది. హే రంభా అనే పాట పాడటం నాకు సంతోషంగా ఉంది.

ప్రతీ ఒక్కరూ అద్బుతంగా నటించేశారు. అంత ఇంటెన్స్ ఉన్న సినిమాను ఈ మధ్య కాలంలో చూసి ఉండరు. ప్రతీ ఒక్క పాత్రకు ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్  చేయడం చాలా కష్టంగా అనిపించినా.. చాలెంజింగ్‌గా తీసుకున్నాను.

బ్యాక్ గ్రౌండ్ కన్నా.. సాంగ్స్ చేయడమే నాకు ఇష్టం. పాటలు చేయడంలో ఫ్రీడం ఎక్కువగా ఉంటుంది. ఆర్ఎక్స్ 100లో రుధిరం, ఎస్ఆర్ కళ్యాణమండపంలోని చుక్కల చున్నీ బాగా ఇష్టం అంటూ ముగించారు చేతన్ భరద్వాజ్.