పుష్పను తప్పించేసిన ఆచార్య?

మొత్తానికి అనుకున్న రీతిలోనే వ్యవహారం ముందుకు సాగుతోంది. మొండిగా సంక్రాంతి సినిమాల మీద పడదాం అనుకున్న ఆచార్య ఆలోచన బెడిసి కొట్టింది.  Advertisement ఆర్ఆర్ఆర్ అనౌన్స్ మెంట్ రాగానే బుద్దిగా ఆ ఆలోచన మానుకుంది.…

మొత్తానికి అనుకున్న రీతిలోనే వ్యవహారం ముందుకు సాగుతోంది. మొండిగా సంక్రాంతి సినిమాల మీద పడదాం అనుకున్న ఆచార్య ఆలోచన బెడిసి కొట్టింది. 

ఆర్ఆర్ఆర్ అనౌన్స్ మెంట్ రాగానే బుద్దిగా ఆ ఆలోచన మానుకుంది. అప్పటి వరకు జనవరి 12నే వస్తాం అంటూ తెగ బీరాలు పలికారు యూనిట్ పెద్దలు. 

ఇప్పుడు డిసెంబర్ 17 అంటూ పట్టుకున్నారు. గిల్డ్ మీటింగ్ లో ఇటు పుష్ప నిర్మాత, అటు ఆచార్య తరపున జనాలు కూర్చుని డిస్కషన్లు సాగించారు. 24న వెళ్లడానికి తమకు ఇబ్బంది అంటూ, రామ్ చరణ్ రెండు సినిమాలు వారం గ్యాప్ లో రావడం సరికాదని వివరించారు వాళ్లు. 

తమది పాన్ ఇండియా సినిమా అని 24 కు వెళ్తే తమకు బాలీవుడ్ లో కుదరదని వాదించారు వీళ్లు. ఆఖరికి నిర్ణయం పెద్దాయిన మెగాస్టార్ కు వదిలేసారు. అంతా మెగాస్టార్ ఎలా నిర్ణయిస్తే అలా అని పుష్ప నిర్మాత నవీన్, యుఎస్ ఫ్లయిట్ ఎక్కి వెళ్లిపోయారు. 

మరి ఏం జరిగిందో ఏమో? ఆచార్య దర్శకుడు కొరటాల శివ బయ్యర్ల మీటింగ్ పెట్టి డిసెంబర్ 17 విడుదల అని చెప్పేసారు. ఈ గురువారం ఇదే విషయాన్ని అదికారికంగా ప్రకటించే అవకాశం వుంది. 

ఇప్పుడు పుష్ప కొత్త డేట్ వెదుక్కోవాలి. పాన్ ఇండియా సినిమాగా అది అంత వీజీ కాదు.