జవాబు తెలియని భేతాళ ప్రశ్న లా మారిపోయింది ఆర్ఆర్ఆర్ విడుదల అన్నది. చెప్పిన ప్రతి డేట్ మారిపోతూ వస్తోంది. ఢంకా భజాయించి మరీ చెప్పినట్లు డేట్ వేసినా మారిపోయింది. లేటెస్ట్ డేట్ జనవరి 7. కానీ ఈ డేట్ కు అయినా వస్తుందా అనే అనుమానాలు ఇంకా వినిపిస్తూనే వున్నాయి.
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాల్సివుండడం, దర్శకుడు రాజమౌళి అంతా పెర్ ఫెక్ట్ గా వచ్చేవరకు వదలని పట్టుదలతో వుండడం అన్నది కీలక కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈసారి పక్కా అని యూనిట్ వర్గాల నుంచి ఎలా వినిపిస్తోందో? కాస్త డవుటే అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఆర్ఆర్ఆర్ వస్తుందన్న నమ్మకంతో సంక్రాంతి డేట్ ను వదిలేసుకోవడానికి భీమ్లానాయక్ నిర్మాతలు అంగీకరించడం లేదు. పక్కాగా వస్తుంది అంటేనే తమ సినిమాను వాయిదా వేస్తాం తప్ప, లేదంటే అనుకున్న ప్రకారం సంక్రాంతికే వస్తాం అంటున్నారు. పైగా ఆర్ఆర్ఆర్ వచ్చినా కూడా వారం గ్యాప్ వుంటుంది కనుక ఓకె అంటున్నారు.
కానీ గిల్డ్ పెద్దలు మాత్రం ఆర్ఆర్ఆర్ వస్తే భీమ్లానాయక్ వెనక్కు వెళ్తే బెటర్ అని సూచించినట్లు బోగట్టా. అలా అయితే శివరాత్రి డేట్ అయిన ఫిబ్రవరి 24ను భీమ్లానాయక్ మేకర్లు ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కానీ అది కూడా ఆర్ఆర్ఆర్ రాకపోతేనే.
తాము డేట్ వదిలేసి, ఆర్ఆర్ఆర్ రాకపోతే మంచి సంక్రాంతి డేట్ మిస్ అయిపోతుందనే ఆలోచనలో భీమ్లా నాయక్ మేకర్లు వున్నారు.