పంచ్ విత్ పవర్ ఫుల్ లుక్

వరుణ్ తేజ్ చాలా కష్టపడి, క్యారెక్టర్ కు తగినట్లు బాడీ పెంచి, చేస్తన్న సినిమా 'గని'. బాక్సర్ గా కనిపించబోతున్నాడు వరుణ్. ఈ సినిమా కోసం బాడీని విపరీతంగా పెంచడమే కాదు, పక్కా బాక్సర్…

వరుణ్ తేజ్ చాలా కష్టపడి, క్యారెక్టర్ కు తగినట్లు బాడీ పెంచి, చేస్తన్న సినిమా 'గని'. బాక్సర్ గా కనిపించబోతున్నాడు వరుణ్. ఈ సినిమా కోసం బాడీని విపరీతంగా పెంచడమే కాదు, పక్కా బాక్సర్ లా తయారయ్యాడు.

ఈ సినిమా విడుదల డేట్ ను అఫీషియల్ గా ప్రకటిస్తూ, చిన్న గ్లింప్స్ ను అందించారు. బాక్సింగ్ రింగ్ లో వున్న వరుణ్ ఓ పవర్ ఫుల్ పంచ్ విసుర్తున్నట్లు ఈ గ్లింప్స్ ను కట్ చేసారు. బ్యాక్ గ్రవుండ్ కూడా దానికి తగినట్లే వుంది.

అల్లు అరవింద్ సమర్పించే ఈ సినిమాను డిసెంబర్ 3న విడుదల చేయబోతున్నారు. అల్లు బాబి నిర్మాత. థమన్ సంగీత దర్శకుడు. 

వాల్మీకి సినిమా తరువాత ఈ సినిమా మీద వరుణ్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కథ మీద, చిత్రీకరణ మీద ఒకటికి రెండు సార్లు కసరత్తు చేసి, ముందు వెనుకలు చూసుకుంటూ వెళ్తున్నారు.