మరో దక్షిణాది ఇంట్రస్టింగ్ సినిమా ‘మామాంగం’

వరస పెట్టి భారీ సినిమాలను, ఆసక్తిదాయకమైన చరిత్ర నేపథ్యం ఉన్న సినిమాలను రూపొందిస్తున్న దక్షిణాది పరిశ్రమ మరో భారీ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేసింది. ఈ సారి మలయాళం వంతు. సాహో,…

వరస పెట్టి భారీ సినిమాలను, ఆసక్తిదాయకమైన చరిత్ర నేపథ్యం ఉన్న సినిమాలను రూపొందిస్తున్న దక్షిణాది పరిశ్రమ మరో భారీ సినిమాకు సంబంధించి టీజర్ ను విడుదల చేసింది. ఈ సారి మలయాళం వంతు. సాహో, సైరా ల తర్వాత వివిధ భాషల్లో విడుదల కాబోతోంది ఈ సినిమా. అదే 'మామాంగం'. 

మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు సంబంధించి టీజర్ ఇప్పటికే విడుదల అయ్యింది. పురాతన కేరళ మార్షల్ ఆర్టి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని టీజర్ ద్వారా స్పష్టం అవుతోంది. పదిహేడో శతాబ్దం నాటి కాన్సెప్ట్ గా ఈ సినిమాను రూపొందించినట్టుగా తెలుస్తోంది. నాటి పరిస్థితులు, పురాతన కళ ఈ సినిమాలో ప్రధాన అంశాలని స్పష్టం అవుతోంది.

మమ్ముట్టీతో పాటు ఉన్నిముకుందన్ మరో ప్రధాన పాత్రలో నటించాడు ఈ సినిమాలో. పద్మకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మలయాళంతో పాటు  తమిళ, తెలుగు, హిందీ భాషల్లో కూడా విడుదల కాబోతోంది.

అల్లువారింట్లో సైరా పార్టీ.. అక్కినేని హీరో కూడా