అరకు నుంచి సంచలన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గొడ్డేటి మాధవి వివాహం ఈనెల 17న జరగనుంది. కుసిరెడ్డి శివప్రసాద్ అనే వ్యక్తితో ఆమె పెళ్లి జరగనుందని కుటుంబీకులు ప్రకటించారు. ఇప్పటికే నిశ్చితార్థం జరిగినట్టుగా సమాచారాం. పదిహేడో తేదీ తెల్లవారుఝామున శరభన్నపాలెంలో వివాహం, విశాఖలో రిసెప్షన్ ఉంటుందని వారు తెలిపారు.
ఎంపీలంటే షష్టిపూర్తి వయసుల్లో ఉంటారనే భావన ఉంటుంది. అయితే తెలుగునాట నుంచి కొందరు పెళ్లి కాని వారు కూడా ఎంపీలుగా ఎన్నికవుతూ వస్తున్నారు గత కొంతకాలంలో. ఎంపీ హోదాల్లో వారు పెళ్లి చేసుకుంటున్నారు. ఇప్పుడు అరకు ఎంపీ గొడ్డేటి మాధవి కూడా అదే కోవకే చెందుతున్నారు.
దేశంలోని ఎంపీలందరిలో కెళ్లా అత్యంత తక్కువ ఆస్తి కలిగిన ఎంపీగా కూడా మాధవి రికార్డుల్లో ఉన్నారు. ఈ పేద, గిరిజన ఎంపీ గురించి జాతీయ మీడియా కూడా ప్రత్యేక కథనాలను ఇచ్చింది. ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టు ఎంప్లయ్ గా, పీఈటీగా పని చేస్తూ ఉండిన మాధవిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత అరకు నుంచి ఎంపీగా నిలబెట్టారు. ఎంతోరాజకీయ నేపథ్యం ఉన్న కిషోర్ చంద్రదేవ్ ను మాధవి ఓడించి ఎంపీగా ఎన్నికైనా సంగతి తెలిసిందే.