శనివారం ఢిల్లీ వెళ్తున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ప్రధానిని కలిసి వివిధ అంశాల గురించి విన్నపాలను చేయనున్నట్టుగా తెలుస్తోంది. 'రైతు భరోసా' పథకం ప్రారంభోత్సవానికి రావాలంటూ మోడీని జగన్ మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి ఆహ్వానించడం ఈ సమావేశం ప్రధాన అజెండా తెలుస్తోంది. ఈ అంశంతో పాటు మరిన్ని అంశాలను కూడా ప్రస్తావించనున్నట్టుగా సమాచారం.
-పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇటీవల నిర్వహించిన రివర్స్ టెండరింగ్ పై కూడా ప్రధానికి వివరిస్తారట వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.
-అలాగే గోదావరి జలాలను శ్రీశైలంకు తరలించే ప్రణాళికను వివరించి.. కేంద్ర సాయం అడగబోతున్నారట.
-విభజిత ఏపీ ఆర్థిక లోటు విషయంలో సాయాన్ని కోరనున్నట్టుగా సమాచారం.
-వెనుకబడిన జిల్లాల నిధులు, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక నిధులను విడుదల చేయాలని ప్రధానిని కోరనున్నారట ఏపీ ముఖ్యమంత్రి.