బాబు ఫైర్ అయితే.. లోకేష్ ఇలా ఛిల్ అయ్యాడు

కొన్ని విషయాల్లో చంద్రబాబుని చూస్తే నిజంగా జాలేస్తుంటుంది. ముఖ్యంగా కొడుకు లోకేష్ విషయంలో. పార్టీ ఓడిపోవడం పక్కనపెడితే, ఏళ్లొస్తున్నా చేతికి అందిరాని కొడుకే చంద్రబాబుకి మానసిక వేదనలా తయారయ్యారు. పోనీ లోకేష్ ఏమైనా కుదురుగా…

కొన్ని విషయాల్లో చంద్రబాబుని చూస్తే నిజంగా జాలేస్తుంటుంది. ముఖ్యంగా కొడుకు లోకేష్ విషయంలో. పార్టీ ఓడిపోవడం పక్కనపెడితే, ఏళ్లొస్తున్నా చేతికి అందిరాని కొడుకే చంద్రబాబుకి మానసిక వేదనలా తయారయ్యారు. పోనీ లోకేష్ ఏమైనా కుదురుగా ఉంటారా అంటే అదీ లేదు. తన మాటలు, చేతలతో కామెడీకి కేరాఫ్ అడ్రస్ లా మారారు. పాలిటిక్స్ లో జబర్దస్త్ షో చూపిస్తున్నారు. ఓవైపు చంద్రబాబు సోషల్ మీడియా పేరుచెప్పి వైసీపీ సర్కార్ పై జగన్ పై లేనిపోని ఆరోపణలు చేస్తుంటే.. ఎన్నడూ లేని విధంగా బూతులు కూడా వాడుతుంటే.. మరోవైపు లోకేష్ మాత్రం ఢిల్లీలో ఛిల్ అయ్యారు.

తాజాగా ఢిల్లీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సమ్మిట్ లో పాల్గొన్నానంటూ తన ట్విట్టర్ అకౌంట్ లో ఫొటోలు పోస్ట్ చేశారు లోకేష్. ఇందులో భాగంగా వివిధ శాఖల సమన్వయంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు డేటా వినియోగం, మెరుగైన పారిశుధ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ప్రసంగించారట. ఆయన ప్రసంగాలు ఎలా ఉంటాయో తెలుగు ప్రజలందరికీ తెలుసు. అందుకేనేమో అక్కడి ప్రసంగానికి సంబంధించిన వీడియోను లోకేష్ పోస్ట్ చేయలేదు.

ఇవన్నీ పక్కనపెడితే, ఇలాంటి సమ్మిట్స్ ఢిల్లీలో వారానికి 4-5 జరుగుతుంటాయి. ఆ సదస్సు ప్రాముఖ్యతను తగ్గించడం ఇక్కడ ఉద్దేశం కాదు కానీ, ఓవైపు చంద్రబాబు తన రాజకీయం కోసం ఓ వివాదాస్పద అంశాన్ని తలకెత్తుకున్నప్పుడు, ఆ టైమ్ లో లోకేష్ కూడా పక్కనే ఉంటే బాగుండేది. కనీసం తనకు అలవాటైన ట్విట్టర్ లో రెస్పాండ్ అయినా సరిపోయేది. అలాంటిదేం జరగలేదు. చినబాబు సీన్ లోకి ఎంటరైతే మొదటికే మోసం వస్తుందని, బాబు ఇలా అతడ్ని సైడ్ చేసి ఉండొచ్చు.

ఓవైపు రాష్ట్రంలో సోషల్ మీడియా ఆగడాలంటూ చంద్రబాబు గగ్గోలు పెడుతున్నవేళ, పక్కన మాజీ ఐటీ మినిస్టర్ లేకపోతే బాగుండదని జనం అనుకుంటారని, లోకేష్ తాను ఆ సమయంలో ఢిల్లీలో ఉన్నట్టు ఇలా సోషల్ మీడియాలో ప్రూఫ్స్ పెట్టుకున్నట్టుంది. తండ్రి ఇక్కడ ఈ వయసులో కూడా గంటల తరబడి నిలబడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లతో కష్టపడుతుంటే.. కొడుకు అక్కడ ఎంచక్కా ప్రసంగాలిస్తూ గడిపేశారన్నమాట. 

నరసింహారెడ్డి ఘన కీర్తిని తెలియజేసేలా..