అల్లువారింట్లో సైరా పార్టీ

మెగా క్యాంప్ అంతా ఇప్పుడు సైరా సక్సెస్ జోష్ మీద వుంది. మంచి సినిమాలు వస్తే యూనిట్ ను సత్కరించడం, పార్టీ ఇవ్వడం, దానికి తమ సర్కిల్ జనాలను కొంతమంది ఆహ్వానించడం అన్నది కొంతకాలంగా…

మెగా క్యాంప్ అంతా ఇప్పుడు సైరా సక్సెస్ జోష్ మీద వుంది. మంచి సినిమాలు వస్తే యూనిట్ ను సత్కరించడం, పార్టీ ఇవ్వడం, దానికి తమ సర్కిల్ జనాలను కొంతమంది ఆహ్వానించడం అన్నది కొంతకాలంగా చేస్తూ వస్తోంది అల్లు అరవింద్ ఫ్యామిలీ. గతంలో మహానటి మరి కొన్ని సినిమాలకు ఇలా చేసారు. 

ఇప్పుడు తమ స్వంత సినిమా లాంటి సైరా వచ్చింది. అందుకే గురువారం రాత్రి అల్లు అరవింద్ ఇంట్లో సైరా యూనిట్ తో విందు ఏర్పాటు చేసారు. ఈ పార్టీకి బోలెడు మంది హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, అల్లు అరవింద్, రాం చరణ్, అల్లు అర్జున్, అఖిల్ అక్కినేని, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్,రత్నవేలు, శ్రీకాంత్, సుష్మిత, పరుచూరి బ్రదర్స్, బొర్రా సాయి మాధవ్, గంట శ్రీనివాసరావు,అల్లు శిరీష్, సురేందర్ రెడ్డి, దిల్ రాజు, హరీష్ శంకర్, యూ వి వంశీ, విక్రమ్, వాసు వర్మ, డాక్టర్ వెంకటేశ్వరావు,మెహర్ రమేష్, కేఎస్ రామారావు, జెమిని కిరణ్ తదితరులు హాజరయ్యారు. 

వీరుకాక యూనిట్ కు చెందిన పలువురు హాజరయ్యారు. అల్లు అరవింద్ స్వయంగా అందరినీ ఆహ్వానించారు. ఇంటి దగ్గర కూడా ఆయనే స్వయంగా అందరినీ పలకరించి, ఆహ్వానించడం విశేషం. ఈ రోజు మధ్యాహ్నం అల్లు అర్జున్ ఫ్యామిలీతో కలిసి ఎఎమ్బీ మాల్ లో సైరా సినిమాను చూసిన సంగతి తెలిసిందే.