మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో నలుగుతున్న “పవర్ స్టార్” సబ్జెక్ట్ పై మ్యూజిక్ డైరక్టర్ కమ్ సింగర్ రఘు కుంచె కూడా స్పందించాడు. వర్మ తీసిన పవర్ స్టార్ అనే సినిమా ఎందుకు తనకు చూడాలని అనిపించడం లేదంటున్నాడు ఈ సంగీత దర్శకుడు.
“ఆర్జీవీ, పవర్ స్టార్ అనే సినిమా తీశారని విన్నాను. నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకో నాకు పవర్ స్టార్ ను చూడాలని అనిపించడం లేదు. కరోనా టైమ్ లో కూడా సినిమాతో ఆయన వ్యాపారం చేస్తున్నారు. ఆయన తెలివితేటలు అవి. ఈ టైమ్ లో కూడా చకచకా 4 కాన్సెప్టులతో సినిమాలు వదుల్తున్నారు. అది ఆయన ఇష్టం. నాకు మాత్రం ఆయన తీసింది చూడాలని లేదు. పవర్ స్టార్ ఒక్కటే కాదు, ఇంతకుముందు ఆయన తీసినవి కూడా నేను చూడలేదు.”
పవన్ కల్యాణ్ మీద సెటైరిక్ గా తీసిన సినిమా కాబట్టి తను చూడలేదనే వాదనను రఘు కుంచె కొట్టి పారేస్తున్నాడు. తనకు ఆసక్తి ఉంటే కచ్చితంగా చూసేవాడినని, గతంలో వర్మ తీసిన సినిమాలు కూడా చూడలేదంటున్నాడు.
“ఓ సినిమా చూడాలంటే ఇంట్రెస్ట్ కలగాలి. పవన్ కల్యాణ్ మీద ఆయన సినిమా తీశారని అంతా అంటున్నారు. నాకు ఇంట్రెస్ట్ లేదు, చూడలేదు. ఎన్టీఆర్ మీద కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ అని తీశారు. అది కూడా చూడలేదు. ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు.”
ఇక సంగీత దర్శకుడిగా తన ప్రయాణం గురించి చెబుతూ.. పూరి జగన్నాధ్ తో మ్యూజిక్ డైరక్టర్ గా చేయాల్సిన కొన్ని సినిమాలు.. పూరి చుట్టూ ఉన్న కొంతమంది స్పాయిలర్స్ వల్ల పోగొట్టుకోవాల్సి వచ్చిందన్నాడు.