డ‌బ్బు కోసం సమంతను హీరో ట్రాప్ చేసి …

నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట విడిపోవ‌డంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. స‌మంత‌దే త‌ప్ప‌ని కొంద‌రంటే, కాదు నాగ‌చైత‌న్య‌దే అనే వాళ్ల సంఖ్య కూడా త‌క్కువ లేదు. కానీ స‌మంత‌కు మ‌హిళా న‌టుల నుంచి మ‌ద్ద‌తు…

నాగ‌చైత‌న్య‌, స‌మంత జంట విడిపోవ‌డంపై ర‌క‌ర‌కాల అభిప్రాయాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. స‌మంత‌దే త‌ప్ప‌ని కొంద‌రంటే, కాదు నాగ‌చైత‌న్య‌దే అనే వాళ్ల సంఖ్య కూడా త‌క్కువ లేదు. కానీ స‌మంత‌కు మ‌హిళా న‌టుల నుంచి మ‌ద్ద‌తు ల‌భిస్తుండ‌డాన్ని ప్ర‌త్యే కంగా చెప్పుకోవాలి. స‌మంత‌కు గ‌ట్టి మ‌ద్ద‌తుదారుగా నిలిచిన వారిలో సినీన‌టి మాధ‌వీల‌త ముందు వ‌రుస‌లో ఉన్నారు.

తాజాగా ఫేస్‌బుక్ లైవ్‌లో నాగ‌చైత‌న్య‌-స‌మంత జంట విడాకుల‌పై మాధ‌వీల‌త నిర్భ‌యంగా మ‌న‌సులో మాట‌ను వెల్ల‌డించారు. ఆమె చేసిన షాకింగ్ కామెంట్స్‌ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. స‌మంత చాలా మంచి అమ్మాయ‌ని స‌ర్టిఫికెట్ ఇచ్చారు. విడాకుల‌కు స‌మంతే కార‌ణ‌మంటూ 99 శాతం మంది అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నార‌న్నారు. స‌మంత‌పై బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ్లామ‌ర్ దుస్తులు ధ‌రించ‌డం వ‌ల్లే స‌మంత‌కు చైత‌న్య విడాకులు ఇచ్చార‌నడంలో నిజం లేద‌న్నారు. తెర‌పై దుస్తుల‌కి, దంప‌తుల సంసారానికి ఏ మాత్రం సంబంధం ఉండ‌ద‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. స‌మంత డ‌బ్బు మ‌నిషి కాద‌న్నారు. సినిమాల ద్వారా సంపాదించే డ‌బ్బును ఏం చేయాలో ఆమెకు తెలియ‌ద‌న్నారు.

గతంలో సమంతను ఒక హీరో ట్రాప్ చేశాడ‌న్నారు. ఆమె దగ్గరున్న డబ్బు కోసం స‌మంత‌ను వాడుకున్నాడని మాధ‌వీల‌త సంచ‌ల‌న ఆరోప‌ణ‌ చేశారు. త‌న‌ను వాడుకున్న విషయం తెలిసి సమంత స‌ద‌రు హీరోకి దూరం జరిగిందని ఆమె ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. 

మాధ‌వీల‌త తాజా కామెంట్స్ సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఇంత‌కూ స‌మంత‌ను డ‌బ్బు కోసం వాడుకున్న హీరో అత‌నేనా అంటూ ఒక హీరో పేరును నెటిజ‌న్స్ తెర‌పైకి తేవ‌డం వైర‌ల్ అవుతోంది. ఒక‌వైపు స‌మంత‌-నాగ‌చైత‌న్య త‌మ విడాకుల‌పై చ‌ర్చ వ‌ద్దే వ‌ద్దంటుంటే… ఆ ప‌ని మ‌రింత ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం.