హీరోలు ఎలా వున్నా, ఇవ్వాళ రేపు గ్రాఫిక్స్ అనేది సిజి వర్క్ అనేది వచ్చేసింది. కోటి రూపాయిలు బడ్జెట్ పక్కన పెట్టుకుంటే లావు తగ్గించేయచ్చు. ముడతలు తీసేయచ్చు. ఎలా వున్నా అందంగా చెక్కేయచ్చు. అయితే అలా అని హీరోలు ఊరుకోరు. వీలయినంత ఫిట్ గా వుండాలనే చూస్తారు. ముఖ్యంగా ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ విషయంలో అస్సలు పట్టించుకున్నట్లు లేదు. ఈ రోజు ఆయన బయటకు వచ్చి, మొక్కలు నాటారు. ఈ సమయంలో చాలా మంది ఆయనను దగ్గర నుంచి చూసారు. చూసిన వాళ్లు చెబుతున్న సమాచారం ప్రకారం పవన్ బాగా చిక్కిపోయినట్లు తెలుస్తోంది. మొహం, జుట్టుమాత్రమే భారీగా కనిపిస్తున్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాతుర్మాస దీక్షలో వున్నారు. ఒంటి పూట భోజనం, వంటి నియమాలు పాటిస్తున్నారు. అందువల్ల ఫిజికల్ గా కాస్త తగ్గివుంటారని అనుకోవాలి. ఇప్పటికే పవన్ చేస్తున్న వకీల్ సాబ్ సినిమా పిక్స్ కొన్ని లీక్ అయ్యాయి.అవేమీ అంతా ఆకర్షణీయంగా లేవు. దీని తరువాత క్రిష్ సినిమా చేయాల్సి వుంది. అందులో కొన్ని గెటప్ లు వుంటాయని, అందుకే పవన్ జుట్టు పెంచుతున్నారని కూడా తెలుస్తోంది. ఆ సినిమా వేళకయినా మేకవర్ అవుతారేమో చూడాలి.