కరడు గట్టిన ప్రాంతీయ పార్టీ కొత్త వేషం!

శివసేన అంటే  ప్రాంతీయ వాదం.. ప్రాంతీయ వాదం అంటే శివసేన.. దేశంలో ఎన్నోచోట్ల ప్రాంతీయ వాదం రాజకీయ రంగును సంతరించుకున్నా.. ఈ విషయంలో శివసేన చాప్టర్ చాలా తీవ్రమైనది. ప్రాంతీయ వాదంతోనే బాల్ ఠాక్రే తన…

శివసేన అంటే  ప్రాంతీయ వాదం.. ప్రాంతీయ వాదం అంటే శివసేన.. దేశంలో ఎన్నోచోట్ల ప్రాంతీయ వాదం రాజకీయ రంగును సంతరించుకున్నా.. ఈ విషయంలో శివసేన చాప్టర్ చాలా తీవ్రమైనది. ప్రాంతీయ వాదంతోనే బాల్ ఠాక్రే తన ప్రస్థానానికి పునాదులు వేసుకున్నారు. అదే వాదమే ఆ పార్టీకి దశాబ్దాల మనుగడను ఇచ్చింది, ఇస్తోంది. ఈ వేర్పాటు వాదాన్నే మరింత అతిగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు రాజ్ ఠాక్రే. అయితే అది మొదట్లో జనాలకు రుచించినట్టుగా కనిపించినా, ఆ తర్వాత మాత్రం రాజ్ ఠాక్రే ఉనికి కోల్పోయారు.

ఇక మరాఠా పార్టీగా పేర్గాంచిన శివసేన ఇప్పుడు ఇతర భాషల్లో ప్రచారం చేస్తూ ఉండటం గమనార్హం. ప్రత్యేకించి శివసేన వారసత్వంలో మూడో తరం నేతగా ఆదిత్య ఠాక్రే ఆరంగేట్రం నేపథ్యంలో ప్రాంతీయ భాషల ప్రచారం చేస్తోంది శివసేన. వర్లీ నియోజకవర్గం పరిధిలో వివిధ భాషల్లో శివసేన ఓటు అడుగుతూ పోస్టర్లు వేసింది. బ్యానర్లు కట్టింది.

వాటిల్లో తెలుగు, గుజరాతీ, హిందీ పోస్టర్లు ఉన్నాయి. వర్లీ ఏరియాలో ఉంటే సామాన్య స్థాయి తెలుగు వాళ్ల ఓట్లను సంపాదించుకోవడానికి ఇలా తెలుగు భాషలో కూడా హోర్డింగులు పెట్టారు శివసేన వాళ్లు. కరడు గట్టిన ప్రాంతీయ వాదానికి కేరాఫ్ అయిన ఆపార్టీ ఇలా ఓట్ల కోసం ఇన్నాళ్లూ తాము నిరసించిన విషయాన్నే అస్త్రంగా మార్చుకోవడం విశేషం. ముంబై అంటే మరాఠాలది అని, అక్కడ వేరే వాళ్లు పనులు కూడా చేసుకోకూడదని నినదించిన పార్టీ ఇలా ఓటు దగ్గరకు వచ్చే సరికి అన్ని భాషల వేషమూ వేస్తోంది!

 'చిరు పనైపోయినట్టే' అని నవ్విన నోళ్లు మూతబడేలా