జగన్ పై సీబీఐ.. మళ్లీ అదే తొండి వాదన!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయనపై నమోదైన కేసుల్లో వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపును ఇవ్వవద్దని సీబీఐ వాదించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి తనపై నమోదైన కేసుల్లో విచారణకు…

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆయనపై నమోదైన కేసుల్లో వ్యక్తిగత హాజరీ నుంచి మినహాయింపును ఇవ్వవద్దని సీబీఐ వాదించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి తనపై నమోదైన కేసుల్లో విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావడం నుంచి మినహాయింపును కోరారు. అయితే అందుకు సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందే అంటూ సీబీఐ వాదించడం గమనార్హం. 

అదేమంటే.. జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారంటూ సీబీఐ వాదన వినిపించింది. అంటే కోర్టుకు హాజరైతేనే ఆయన సాక్షులను ప్రభావితం చేయరా? హాజరుకాకపోతే ప్రభావితం చేస్తారా? అనేది సీబీఐకే అర్థం కావాల్సిన తర్కం. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ కు విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం కష్టం కాదని, ఆయనకు మినహాయింపును ఇవ్వవద్దని సీబీఐ వాదించింది. 

అయితే సీబీఐ ఏళ్ల తరబడి విచారణలు కొనసాగిస్తూ ఉంటే, నిందితులు అలా ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ ప్రతివారం తిరగాల్సిందేనా? అనేది ప్రాథమిక విషయం. ఇప్పటికి జగన్ పై కేసుల విచారణ మొదలై దాదాపు ఎనిమిదేళ్లు గడిచాయి. అయితే ఇప్పటి వరకూ ఏం సాధించారో ఎవరికీ తెలీదు.

పదహారు నెలల పాటు జగన్ ను జైల్లో పెట్టారు, ఎనిమిదేళ్లుగానూ కోర్టు చుట్టూ తిప్పుతున్నారు. ఇప్పుడు సీఎం హోదాలో ఉన్నా.. ఆయన వారం వారం విచారణకు హాజరు కావాల్సిందే అంటూ సీబీఐ వాదించడం వితండవాదంగా అనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో!

 'చిరు పనైపోయినట్టే' అని నవ్విన నోళ్లు మూతబడేలా