ఇదంతా కన్నబాబు చలవేనా?

లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టిన ఆంధ్రలో సైరా అదనపు ఆటల వ్యవహారం సుఖాంతం అయింది. ఈ మేరకు ఆదేశాలు వచ్చాయి. అయితే చిరంజీవి తరపున పూర్తిగా లాబీయింగ్ చేసింది ఎవరు? సినిమా రంగం…

లాస్ట్ మినిట్ వరకు టెన్షన్ పెట్టిన ఆంధ్రలో సైరా అదనపు ఆటల వ్యవహారం సుఖాంతం అయింది. ఈ మేరకు ఆదేశాలు వచ్చాయి. అయితే చిరంజీవి తరపున పూర్తిగా లాబీయింగ్ చేసింది ఎవరు? సినిమా రంగం వైపు నుంచి టాగోర్ మధు, ఎన్వీ ప్రసాద్ తదితరులు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎస్వీ సుబ్బారెడ్డిల ద్వారా ప్రయత్నించారు.

అయితే ఎలా వుంటుందో పరిస్థితి అని మెగాస్టార్ మూడురోజులు ముందుగానే తన సన్నిహితుడు, రాష్ట్రమంత్రి కన్నబాబుకు చెప్పారని తెలుస్తోంది. మెగాస్టార్ తో వున్న సాన్నిహిత్యం, తనను రాజకీయాల్లోకి తీసుకువచ్చి, తొలిసారి ఎమ్మెల్యేను చేసారన్న గౌరవం కలిసి, కన్నబాబును రంగంలోకి దిగేలా చేసాయి.

మొత్తంమీద అట్నుంచి సుబ్బారెడ్డి ఇట్నుంచి కన్నబాబు నరుక్కు రావడంతో ఆంధ్రలో సైరా అదనపు ఆటల వ్యవహారం కొలిక్కి వచ్చింది. నిజానికి మొన్న ఎన్నికల ముందు కన్నబాబును, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విపరీతంగా టార్గెట్ చేసారు.

కాకినాడ వెళ్లి మరీ విమర్శించారు. కానీ మెగాస్టార్ మీద వున్న అభిమానం, విశ్వాసం కన్నబాబును అవన్నీ మరిచి, అదనపు ఆటల కోసం ప్రయత్నించేలా చేసాయని ఆయన సన్నిహిత వర్గాల బోగట్టా.

'చిరు పనైపోయినట్టే' అని నవ్విన నోళ్లు మూతబడేలా