cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Reviews

షాక్ ఇచ్చిన సెప్టెంబర్.. టాలీవుడ్ రివ్యూ

షాక్ ఇచ్చిన సెప్టెంబర్.. టాలీవుడ్ రివ్యూ

సరిగ్గా ఇదే సీజన్ కు గతేడాది సెప్టెంబర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా, చెప్పుకోవడానికి సినిమాలైనా ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో కనీసం ఆ ముచ్చట కూడా లేకుండాపోయింది. బడా సినిమాలకు దూరంగా, డిజాస్టర్లకు అతి దగ్గరగా సాగింది సెప్టెంబర్ బాక్సాఫీస్ ప్రయాణం.

సరిగ్గా ఇదే సీజన్ కు గతేడాది సెప్టెంబర్ లో చెప్పుకోదగ్గ హిట్స్ లేకపోయినా, చెప్పుకోవడానికి సినిమాలైనా ఉన్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లో కనీసం ఆ ముచ్చట కూడా లేకుండాపోయింది. బడా సినిమాలకు దూరంగా, డిజాస్టర్లకు అతి దగ్గరగా సాగింది సెప్టెంబర్ బాక్సాఫీస్ ప్రయాణం.

సెప్టెంబర్ మొదటివారంలో ఏకంగా 7 సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఆగస్ట్ 30న సాహో సినిమా రిలీజ్ అవ్వడంతో సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో బడా సినిమాలేవీ కనిపించలేదు. వచ్చిన 7 సినిమాల్లో జోడీ మాత్రమే కాస్త తెలిసిన సినిమా. ఆది సాయికుమార్, జెర్సీ ఫేం శ్రద్ధా శ్రీనాధ్ జంటగా నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ మూవీ మినహా ఆ వారంలో చెప్పుకోడానికేం లేవు. ఉండిపోరాడే, దర్పణం, 2 అవర్స్ లవ్, వీడే సరైనోడు, నీకోసం, తారామణి.. ఇలా వచ్చిన సినిమాలన్నీ ఎలాంటి చడీచప్పుడు చేయకుండా అలానే వెనక్కి వెళ్లిపోయాయి.

రెండోవారంలో అందరి దృష్టి గ్యాంగ్ లీడర్ పై పడింది. నాని-విక్రమ్ కుమార్ కాంబోలో వచ్చిన ఈ సినిమా రికార్డులు సృష్టించకపోయినా, కొత్తగా ఉంటుందని మాత్రం చాలామంది ఆశించారు. కానీ ఆ కొత్తదనంతో పాటు కలెక్షన్లు కూడా లేకుండా పోయాయి. ఈ సినిమాకు రేటింగ్స్ బాగానే పడ్డాయి. ఫస్ట్ వీకెండ్, మొదటి వారం వసూళ్లు కూడా బాగున్నాయి. అంతే... అక్కడ్నుంచి సినిమా అమాంతం డ్రాప్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో 21 కోట్ల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా చాలా ఏరియాల్లో బ్రేక్-ఈవెన్ అవ్వలేకపోయింది.

విక్రమ్ కుమార్ రాసుకున్న క్రైమ్ కామెడీ వర్కవుట్ కాకపోవడం దీనికి ఓ కారణమైతే, నాని యాక్టింగ్ మరీ రొటీన్ గా మారడం మరో పెద్ద రీజన్. గ్యాంగ్ లీడర్ కు ఒకరోజు ముందు వచ్చిన పహిల్వాన్, గ్యాంగ్ లీడర్ తో పాటు వచ్చిన మార్షల్ సినిమాలు అట్టర్ ఫ్లాపులగా నిలిచాయి. సుదీప్ హీరోగా నటించిన పహిల్వాన్ సినిమాను పాన్-ఇండియన్ మూవీగా ప్రొజెక్ట్ చేశారు. కానీ ఇది సగటు కన్నడ చిత్రం కంటే దిగువస్థాయిలో ఉంది. అటు శ్రీకాంత్ విలన్ గా నటించిన మార్షల్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయింది.

గ్యాంగ్ లీడర్ కు పుంజుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా చేశాడు గద్దలకొండ గణేష్. ఇంకొక్క వీకెండ్ దొరికితే బాగుంటుందనుకున్న గ్యాంగ్ లీడర్ కు ఆ ఛాన్స్ దక్కలేదు. మూడోవారంలో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ థియేటర్లలోకి వచ్చేసింది. తమిళ హిట్ జిగర్తాండాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే మంచి వసూళ్లు సాధించింది. ఇంకా చెప్పాలంటే చాలా ఏరియాల్లో బ్రేక్-ఈవెన్ కూడా అయింది. హరీష్ శంకర్ రాసుకున్న మాస్ ఎలిమెంట్స్, సినిమాకు చేసిన ప్రమోషన్ కలగలిపి గద్దలకొండ గణేష్ ను కమర్షియల్ గా హిట్ చేశాయి.

ఈ సినిమాతో పాటు వచ్చిన బందోబస్త్ మాత్రం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించింది. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య నటించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. పైకి చెప్పుకోలేనంత అవమానకర స్థాయిలో ఈ సినిమాకు వసూళ్లు వచ్చాయంటే బందోబస్ట్ ను ప్రేక్షకులు ఏ రేంజ్ లో తిప్పికొట్టారో అర్థంచేసుకోవచ్చు. ఇక ఇదేవారంలో వచ్చిన నేను నా నాగార్జున, పండుగాడి ఫొటోస్టూడియో సినిమాలు కూడా డిజాస్టర్లుగా మారాయి.

ఇక సెప్టెంబర్ ఆఖరి వారంలో కూడా ఎలాంటి మెరుపుల్లేవు. సైరా రిలీజ్ ను దృష్టిలో పెట్టుకొని ఎవ్వరూ పెద్ద సినిమాల్ని రిలీజ్ చేయలేదు. రాయలసీమ లవ్ స్టోరీ, నిన్ను తలచి, రామ చక్కని సీత లాంటి 5 చిన్న సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ఇవన్నీ ఇలా వచ్చి అలా వెళ్లాయి. ఓవరాల్ గా సెప్టెంబర్ నెలలో గద్దలకొండ గణేష్ సినిమా మాత్రమే కమర్షియల్ గా సక్సెస్ అయింది. 

'చిరు పనైపోయినట్టే' అని నవ్విన నోళ్లు మూతబడేలా

 


×