‘చుక్క’ లేక చుక్కలు చూసిన మందు బాబులు

రాష్ట్రంలో అన్ని వర్గాలవారు సీఎం జగన్ పరిపాలనతో పూర్తి సంతృప్తిగా ఉన్నారు. వ్యవసాయదారులు వైఎస్సార్ రైతు భరోసాపై ధీమాగా ఉన్నారు. నిరుద్యోగులకు సచివాలయాల ఉద్యోగ నియామకాలు కొత్త జీవితాలనిచ్చాయి. అమ్మఒడి అమలులోకి వస్తే ప్రతి…

రాష్ట్రంలో అన్ని వర్గాలవారు సీఎం జగన్ పరిపాలనతో పూర్తి సంతృప్తిగా ఉన్నారు. వ్యవసాయదారులు వైఎస్సార్ రైతు భరోసాపై ధీమాగా ఉన్నారు. నిరుద్యోగులకు సచివాలయాల ఉద్యోగ నియామకాలు కొత్త జీవితాలనిచ్చాయి. అమ్మఒడి అమలులోకి వస్తే ప్రతి తల్లీ పిల్లల స్కూల్ ఫీజుల భారం నుంచి బైటపడుతుంది. ఇక ఆటోకార్మికులు, చేనేత కార్మికులు, ఆశావర్కర్లు.. సమాజంలోని ప్రతి వర్గం జగన్ నిర్ణయాలకు ప్రభావితమైంది, సంతోషంగా ఉంది. ప్రతిపక్షాల సంగతి పక్కనపెడితే ఒక కేటగిరీ వ్యక్తులు మాత్రం జగన్ పై కత్తులు నూరుతున్నారు. జగన్ పేరు చెబితేనే కోపంతో రగిలిపోతున్నారు. వారే మందుబాబులు.

రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్ 1న అంటే నిన్న.. మందుబాబులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఎప్పటిలాగే ఉదయాన్నే 9 గంటలకల్లా షాపుల దగ్గరకి వచ్చేశారు మందుబాబులు. టైమ్ గడుస్తోంది షాపు డోర్ తీయలేదు, నాలుక పీకేస్తోంది, ఎవరిని అడిగినా సమాధానం చెప్పడం లేదు. ఒక్కరోజు ముందుగానే ముఖ్యమంత్రి జగన్ మద్యం షాపుల టైమింగ్స్ పై తీసుకున్న నిర్ణయంతో మందుబాబులు నానా అవస్థలు పడ్డారు.

తీరా 11 గంటలకు షాపు తీయగానే సైరా సినిమాకి టికెట్ల కోసం క్యూలో నిలబడ్డట్టు షాపు ముందు బారులు తీరారు. అక్కడితో ఆ ముచ్చట అయిపోయింది. ఇక విషయం తెలియని చాలామంది రాత్రి 8 గంటల తర్వాత షాపుల దగ్గర తచ్చాడుతూ కనిపించారు. రాత్రి 8 గంటలకే షాపులు మూతపడటంతో చాలామంది అవాక్కయ్యారు. అప్పుడే షాపు మూసేశారా అని ఆశ్చర్యం, అసహనం వ్యక్తంచేశారు.

వైన్ షాపుల టైమింగ్స్ ని ఉదయం 11నుంచి రాత్రి 8 గంటలకు పరిమితం చేస్తూ లాస్ట్ మినిట్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా మందుబాబుల్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. నిన్న రాత్రి మందు మిస్ అయినోళ్లకు ఈరోజు మరింత నరకం. ఎందుకంటే గాంధీ జయంతి. షాపులన్నీ బంద్. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయంపై మందుబాబులు గుస్సా అవుతున్నారు.

కొత్త విధానం అమల్లోకి వచ్చిన మరుసటి రోజే వైన్ షాపులు బంద్ అవ్వడాన్ని వీళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు వ్యక్తిగత కొనుగోళ్లపై కూడా పరిమితి విధించడంతో బయట కూడా మందు దొరకని పరిస్థితి. విచ్చలవిడిగా మందు దొరకడం, బెల్ట్ షాపులకు అనుమతులిచ్చేయడంతో ఇప్పటివరకూ ఇలా ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్నారు మందుబాబులు.

జగన్ తీసుకున్న తాజా నిర్ణయాలతోనైనా వీరి అలవాట్లలో మార్పులొస్తాయేమో చూడాలి. అందరూ కాకపోయినా కొంతమంది మారినా జగన్ తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయానికి సార్థకత చేకూరినట్టే. 

 'చిరు పనైపోయినట్టే' అని నవ్విన నోళ్లు మూతబడేలా