ఆల్రెడీ ఒక భాషలో హిట్టైన సినిమాను మరో భాషలో రీమేక్ చేసి, మళ్లీ ఒరిజిల్ ను రూపొందించిన భాషలోకే రీమేక్ సినిమాను అనువాదం చేయడం కొత్త ఏమీకాదు. తెలుగు వాళ్లకు ఇలాంటి చాలా 'చిత్రాలనే' చూపించారు పక్కభాషల వాళ్లు. అలాంటి సినిమాల జాబితా పెద్దదే. తెలుగులో హిట్టైన సినిమాను రీమేక్ చేసుకుని, మళ్లీ ఆ సినిమానే తెలుగు వాళ్లకు చూపించే ప్రయత్నాలు చాలానే జరిగాయి. అయితే అలాంటివి ఏవీ థియేటర్లలో హిట్ అయ్యే అవకాశాలు ఏమాత్రం లేవనేది కామన్ సెన్స్.
అయినా ఆ ప్రయత్నాలు ఆగడంలేదు. ఏ టీవీ రైట్స్ నో, లేక యూట్యూబ్ లో పెట్టుకోవడానికో బోలెడన్ని సినిమాలు అనువాదం అవుతూ ఉంటాయి. ఆ జాబితాలోనే నిలుస్తోంది '100 పర్సెంట్ కాదల్'. కొన్నేళ్ల కిందట సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100 పర్సెంట్ లవ్ సినిమాను ఇటీవలే తమిళంలో రీమేక్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించాడు. షాలినీ పాండే హీరోయిన్.
తమిళంలో ఈ సినిమా ఏ మేరకు ఆడిందో కానీ..vదీన్ని తెలుగులోకి డబ్ చేసి ఈ వారంలోనే విడుదల చేస్తున్నారు. ఇలా తెలుగులో హిట్టైన సినిమాను రీమేక్ చేసుకుని, మళ్లీ దాన్నే తెలుగులోకి అనువదించి చూపుతున్నారు. అయినా ఆల్రెడీ చూసిన సినిమాలో మళ్లీ చూడటానికి ఏముంది? ఎలాగూ జీవీ ప్రకాష్ కుమార్ ను హీరోగా తెలుగు వాళ్లు చూడలేరు. మరి షాలినీ పాండేని?