చంద్రబాబు నాయుడి ఎన్నికపై కోర్టు నోటీసులు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం నుంచి గెలవడం అయితే గెలిచారు కానీ చాలావరకూ ఆయన మెజారిటీ తగ్గిపోయింది. ఒకప్పుడు 60 వేల మెజారిటీతో నెగ్గిన  నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు…

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కుప్పం నుంచి గెలవడం అయితే గెలిచారు కానీ చాలావరకూ ఆయన మెజారిటీ తగ్గిపోయింది. ఒకప్పుడు 60 వేల మెజారిటీతో నెగ్గిన  నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ఇటీవల తెచ్చుకున్న మెజారిటీ కేవలం 30 వేలు మాత్రమే! తొలి రౌండ్ల కౌంటింగ్ లో చంద్రబాబు నాయుడు వెనుకబడ్డారు కూడా. చంద్రబాబుకు ప్రధాన ప్రత్యర్థి అయిన చంద్రమౌళి సరిగా ప్రచారం చేసుకోలేకపోయినా అలాంటి ఫలితాలు వచ్చాయి.

చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గంలో నోటాకు పడ్డ ఓట్లు దాదాపు మూడు వేలు! ఇక ఇతర పార్టీలు కూడా పొందిన ఓట్లు మరో ఎనిమిది వేలు! స్థూలంగా ఇదీ చంద్రబాబు నాయుడు ఇటీవలి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన పద్ధతి! ఆ సంగతలా ఉంటే.. చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో లోపాలపై ఆయన ప్రత్యర్థి తరఫున ఒకరు కోర్టుకు ఎక్కారు. ఆస్తుల వ్యవహారాలను, ఆదాయ వ్యవహారాలను చంద్రబాబు నాయుడు ఎన్నికల అఫిడవిట్ లో సరిగా పేర్కొనలేదు అనేది ఆరోపణ.

ఈ మేరకు కోర్టుకు ఎక్కారని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు చంద్రబాబు నాయుడు సరైన సమాచారాన్ని అఫిడవిట్ లో పేర్కొనలేదని ఫిర్యాది దారుడు పేర్కొన్నారు. మరి ఇలాంటి వ్యవహారాల్లో తప్పు తేలితే నేతలు ఎమ్మెల్యేగా అనర్హత వేటుకు గురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు.

సౌత్ స్టార్ హీరోలు.. బాలీవుడ్ లో లాంగ్వేజ్  ప్రాబ్లమ్!