ఆంధ్రలో అదనపు ఆటలు వేయడానికి సైరా సినిమాకు ఇప్పటి వరకు పర్మిషన్ రాలేదు. వస్తుందా? రాదా? అన్నది తెలియదు. కానీ 2వ తేదీన ఉదయం అయిదుగంటలకే షోలు పెట్టుకుని, టికెట్ లు అమ్మేయమని, బయ్యర్లకు సందేశాలు సైరా యూనిట్ నుంచి వెళ్లినట్లు తెలిసింది. అయితే అలా అమ్మేస్తే, అనుమతి రాకపోతే సమస్య అవుతుందని బయ్యర్లు, ఎగ్జిబిటర్లు ముందు వెనుక ఆడుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు ఆదేశాలు రాలేదు, మరి మెగా ధీమా ఏమిటి? ఒకపక్క జగన్ బాబాయి సుబ్బారెడ్డి ద్వారా, ఇంకోపక్క వైకాపాలోని కాపు నాయకుల ద్వారా, ఇంకో పక్క రెడ్డి సామాజిక వర్గం ద్వారా ట్రయ్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ ఇలావుంచి, జిల్లాల వారీగా, థియేటర్ల నుంచి కలెక్టర్లకు అప్లికేషన్ లు అందించి, అక్కడ అనుమతి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని బోగట్టా.
అయితే ఏది ఏమైనా తెల్లవారుఝామున అయిదు గంటలకన్నా ముందు మాత్రం షోలు వద్దు అని క్లియర్ గా డిసైడ్ అయిందట సైరా యూనిట్. తొలి షో అయిదు గంటలకు పడితేచాలు అని అంటున్నారట. అందువల్ల ఇప్పటికి అనుమతి రావడానికి ఇక కొన్ని గంటలు మాత్రమే వుంది. మరో నాలుగయిదు గంటల్లో అనుమతి రాకుంటే ఇక ఎర్లీ షోలు వుండకపోవచ్చు.