హీరో రామ్ కు యాక్సిడెంట్

హీరో రామ్ పోతినేని గాయాల పాలయ్యాడు. జిమ్ లో వ్యాయామం చేస్తుండగా ఈ హీరో మెడకు గాయమైంది. తను గాయపడిన విషయాన్ని రామ్ స్వయంగా వెల్లడించాడు. మెడకు నెక్ బెల్ట్ పెట్టుకొని దిగిన సెల్ఫీని…

హీరో రామ్ పోతినేని గాయాల పాలయ్యాడు. జిమ్ లో వ్యాయామం చేస్తుండగా ఈ హీరో మెడకు గాయమైంది. తను గాయపడిన విషయాన్ని రామ్ స్వయంగా వెల్లడించాడు. మెడకు నెక్ బెల్ట్ పెట్టుకొని దిగిన సెల్ఫీని పోస్ట్ చేశాడు.

ప్రస్తుతం లింగుసామి దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్. కృతి షెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కోసం ఓ కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. ఈ బాడీ ట్రాన్సఫర్మేషన్ లో భాగంగా రామ్ మెడకు గాయమైంది. దీంతో రామ్ నటిస్తున్న సినిమా షూటింగ్ ఆగిపోయింది

తాజాగా ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. ఇందులో రామ్ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా బీస్ట్ లుక్ లో కనిపించబోతున్నాడని టాక్. దీనికి సంబంధించి కాస్త కండలు పెంచేందుకు వర్కవుట్స్ పెంచాడు రామ్. ఈ క్రమంలో గాయాల పాలయ్యాడు.

రామ్ కెరీర్ లో 19వ సినిమా ఇది. ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కుతోంది ఈ సినిమా.