వెధవలు..దరిద్రులు-మంచు తిట్లు

మా ఎన్నికల నేపథ్యంలో సీనియర్ హీరో మంచు మోహన్ బాబు సీరియస్ కామెంట్లు చేసారు. ఆయన ఓ ఇంటర్వూలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, వెధవలు, నీచ , నికృష్ట, దరిద్రులు అంతా తయారయ్యారని,…

మా ఎన్నికల నేపథ్యంలో సీనియర్ హీరో మంచు మోహన్ బాబు సీరియస్ కామెంట్లు చేసారు. ఆయన ఓ ఇంటర్వూలో ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ, వెధవలు, నీచ , నికృష్ట, దరిద్రులు అంతా తయారయ్యారని, అందులో ఏదో వుందని ఎవరికి పడితే వారు తయారవుతున్నారని ఆయన అన్నారు. అసలు విష్ణు పోటీ చేస్తాడని, చేయాలని ఏనాడో తలంపు లేదని అన్నారు. 

పేర్లు చెప్పను కానీ, ఇక్కడ తన గురించి మాట్లాడుతున్నవారి జాతకాలు అన్నీ తనకు తెలుసు అని, కానీ తనకు సంస్కారం వుందని అందుకే మాట్లాడనని ఆయన అన్నారు. విష్ణును తను మాత్రమే కాదు , సభ్యులు అందరూ ఆశీర్వదిస్తున్నారని ఆయన అన్నారు. 

మెగా ఫ్యామిలీలో ఎవరు పోటీ చేసినా, చిరంజీవి అడిగితే కచ్చితంగా విష్ణును పోటీ నుంచి ఉపసంహరించేవాడినని ఆయన అన్నారు. ప్రకాష్ రాజ్ స్నేహితుడు కాదని, సినిమా స్నేహితుడు మాత్రమే అన్నారు. 

సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ఇప్పుడు లేరని, దాసరితోనే పెద్దరికం అన్నది, పెద్దలు అన్నది లేకుండా పోయారని అన్నారు. ఎవరైనా తము పెద్దలం అనుకుంటే వారి విజ్ఞతకు వదిలేస్తా అన్నారు.

మా ఎన్నికల విషయంలో కాంప్రమైజ్ కు ఎవ్వరూ ప్రయత్నించలేదని మోహన్ బాబు వెల్లడించారు. చిరంజీవికి చెబుదామని విష్ణు ప్రయత్నించినా కుదరలేదన్నారు.