పుష్ప..ఆచార్య ఏదో ఒకటేనా?

డిసెంబర్ 17 విడుదల అంటూ బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తయారవుతున్న పుష్ప డేట్ వచ్చేసింది. కానీ ఇంకా మెగాస్టార్ ఆచార్య సినిమా డేట్ ఇంకా రాలేదు.  Advertisement కొరటాల శివ డైరక్షన్ లో తయారైన…

డిసెంబర్ 17 విడుదల అంటూ బన్నీ-సుకుమార్ కాంబినేషన్ లో తయారవుతున్న పుష్ప డేట్ వచ్చేసింది. కానీ ఇంకా మెగాస్టార్ ఆచార్య సినిమా డేట్ ఇంకా రాలేదు. 

కొరటాల శివ డైరక్షన్ లో తయారైన ఈ సినిమా డేట్ కోసం వెదుకులాడుతూనే వుంది. దసరాకు రావాలి అంటే రేట్లు లేవు. త్వరలో రేట్లు వస్తాయి అనుకుంటే, డేట్ దొరకడం లేదు.

సంక్రాంతి బరిలోకి చాన్స్ లేదు. మార్చి, ఏప్రిల్ అంటే కూడా అనేక సినిమాల డేట్ లు వచ్చేసాయి. అప్పటి దాకా వేచి వుంటే ఇంకా..ఇంకా ఆలస్యం అయిపోతుంది. డిసెంబర్ 24న విడుదల అనుకుంటే అక్కడికి ఆర్ఆర్ఆర్ విడుదల చాలా దగ్గరగా వుంటుంది.

ఇక మిగిలింది డిసెంబర్ 17 మాత్రమే. ఇప్పుడు ఈ డేట్ మీదనే ఆచార్య కూడా ఆశ పెట్టుకుని వున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమా వర్క్ ఇంకా చాలా వుంది. యుద్ద ప్రాతిపదికన తయారైతే తప్ప రెడీ కావడం కష్టం అని వినిపిస్తోంది. అలా అయితే ఆ డేట్ ను తీసుకునే ఆలోచనలో ఆచార్య వునట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 

కానీ బన్నీ ఈ డేట్ విషయంలో చాలా పట్టుదలగా వున్నారు. ఇక్కడ ఇంకో సమస్య కూడా వుంది. డిసెంబర్ 17 అంటే క్రిస్మస్ సీజన్. ఓవర్ సీస్ లో ఏటా ఆ టైమ్ లో ఓ భారీ హాలీవుడ్ సినిమా వుంటుంది. అలాంటి టైమ్ లో తెలుగు సినిమా అంటే ఓవర్ సీస్ లో కాస్త ఇబ్బంది కావచ్చు. 

మొత్తానికి ఆచార్య సినిమాకు ఈ ఏడాదిలో మిగిలిన డేట్ డిసెంబర్ 17 మాత్రమే. ఆ డేట్ కు పుష్ప వస్తుందో? ఆచార్య వస్తుందో? చూడాలి.