డైరక్టర్ ఆర్జీవీ ఇప్పుడు అందరికీ టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే పరాన్నజీవి అనే పేరుతో సినిమా తయారవుతోంది. అయితే అది మినీ సినిమా. కానీ ఇంతకు ముందే మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. నిర్మాత శ్రీనివాస్ బొగ్గరం ఆర్ జి వి అనే సినిమా నిర్మిస్తున్నారు. ఆర్జీవీ తన పవర్ స్టార్ సినిమా విడుదల చేయడానికి కొన్ని గంటల ముందు అదే ఆర్జీవీ పై ఆర్జీవీ సినిమాలోంచి ఓ సాంగ్ ను విడుదల చేసారు.
గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ పాటను రాసారు. ఆయనే ఈ సినిమాకు దర్శకుడు కూడా. వీణాపాణి స్వరపరచగా రేవంత్ ఆలపించిన “వోడ్కా మీద ఒట్టు నేన్ బాడ్కావ్ నాకొడుకు ని” అంటూ ఈ పాట సాగింది. ఆర్జీవీ తనకు తానే తన అవలక్షణాలన్నీ వర్ణిస్తున్నట్లుగా సాగింది ఈ పాట.
ఈ సినిమా చిత్రీకరణ కరోనా కారణంగా ఆగింది. లాక్ డౌన్ తరువాత మళ్లీ ప్రారంభం అవుతుంది. గతంలో ఆర్జీవీకి జొన్నవిత్తులకు మధ్య కొంతకాలం వివాదం నడించింది. ఈ నేపథ్యంలో ఆయన ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు.