ఇటీవల చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత నిర్మాణ రంగంలో అడుగు పెట్టిన విషయం తెలిసిందే. ‘గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్’ బ్యానర్‌పై సినిమాలు తీయాలని ఆమె ఉత్సాహంగా ఉన్నారు. రావడం రావడంతోనే వెబ్‌సిరీస్‌కు ప్లాన్ చేశారు. తన తల్లి సురేఖ చేతుల మీదుగా వెబ్ సిరీస్ షూటింగ్‌ను స్టార్ట్ చేశారు.
‘ఓయ్’ ఫేమ్ ఆనంద్ రంగా దర్శకత్వంలో వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ వెబ్ సిరీస్‌లో విలక్షణ సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్ కీలకపాత్రలో నటించనున్నారు. ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా షూటింగ్ కొనసాగుతుండగా…అకస్మాత్తుగా అడ్డంకి ఏర్పడింది.
ఒక్కసారిగా ఆమె వెబ్‌సిరీస్ షూటింగ్‌కు బ్రేక్ పడింది. దీనికి కారణం కరోనా మహమ్మారి. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని షూటింగ్ చేపట్టినా…ఏదో రకంగా ఆ వైరస్ ఆక్రమణ చేస్తూనే ఉంది. సుస్మిత టీంలోని ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో మిగిలిన సభ్యులంతా అప్రమత్తం కావాల్సి వచ్చింది. సదరు వ్యక్తితో దగ్గరిగా తిరిగిన వారందరికీ కోవిడ్ పరీక్షలు చేయించారామె. వారందరినీ 14 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండాలని సుస్మిత కోరినట్టు టాలీవుడ్ సమాచారం.
వెబ్ సిరీస్‌కు సంబంధించి కొన్ని ఎపిసోడ్స్ షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో మహమ్మారి కరోనా వల్ల షూటింగ్ ఆగిపోవడం సుస్మితకు కాస్త డిజప్పాయింట్ కలిగించిందని టాక్. కరోనా కారణంగా ఇలా అర్ధాంతరంగా ఆగిన షూటింగ్‌లు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడా జాబితాలో చిరు కుమార్తె వెబ్ సిరీస్ కూడా చేరింది.