ఈ మధ్య కొంతకాలంగా వినిపిస్తున్న మాట ఒకటి వుంది. డైరక్టర్ ఆర్జీవీ మీద టాలీవుడ్ ఏం చర్య తీసుకోలేదా? అన్నదే ఆ మాట. ఈ విషయం ఆర్జీవీ వరకు వెళ్లినట్లుంది. చానెళ్లకు వరుసగా ఇస్తున్న ఇంటర్వ్యూల్లో కూడా ఈ ప్రశ్న ఎదురవుతోంది. అందుకే ఆర్జీవీ కూడా ఓ మాట అంటున్నారని బోగట్టా. టాలీవుడ్ నన్ను బాయ్ కాట్ చేయడం ఏమిటి? నేనే టాలీవుడ్ ను బాయ్ కాట్ చేసాను అనే టైపులో ఆర్జీవీ మాట్లాడుతున్నారు.
తన సినిమాలకు టాలీవుడ్ సహకారం అక్కరలేదని, థియేటర్లు అవసరం లేదని, ఇతరత్రా సహకారం ఏదీ అక్కరలేదని, అందువల్ల తనను బాయ్ కాట్ చేసినా వచ్చిన నష్టం లేదని ఆర్జీవీ సన్నిహితులతో అంటున్నట్లు తెలుస్తోంది. ఇది చూస్తుంటే ఆర్జీవీ అన్నింటికి సిద్దపడి, అన్నింటికి తెగించి ఈ తరహా కాంట్రావర్సీ సినిమాలు తీస్తున్నట్లు స్పష్టం అవుతోంది.
కానీ ఆర్జీవీ పవర్ స్టార్ తరువాత ఈ సినిమా సెలబ్రిటీల కాంట్రావర్సీ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టరు కానీ కామా అయితే పెడతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన లిస్ట్ లో అమృత సంఘటనపై సినిమా ఒక్కటే కాంట్రావర్సీది గా వుంది. నాన్ కాంట్రావర్సీ సినిమాలు కరోనా, ఎన్ఎన్ఎన్ 2 ఇలా మిగిలినవి చాలా వున్నాయి. వారానికి ఒకటి అన్నది ఆర్జీవీ టార్గెట్ గా వుంది. మరి ఆ టార్గెట్ ఎంతకాలం సాఫీగా సాగుతుందో చూడాలి.