కరోనా దెబ్బ.. భారీ సీక్వెల్ మరో ఏడాది లేటు

కరోనా కాటుకు ప్రపంచవ్యాప్తంగా వినోద రంగం దెబ్బతింది. సినిమా షూటింగ్స్, రిలీజ్ లు ఆగిపోవడంతో పాటు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంకా చెప్పాలంటే సినీపరిశ్రమలన్నీ ఏడాది వెనక్కి వెళ్లిపోయాయి. ప్రపంచమంతా ఆసక్తిగా…

కరోనా కాటుకు ప్రపంచవ్యాప్తంగా వినోద రంగం దెబ్బతింది. సినిమా షూటింగ్స్, రిలీజ్ లు ఆగిపోవడంతో పాటు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇంకా చెప్పాలంటే సినీపరిశ్రమలన్నీ ఏడాది వెనక్కి వెళ్లిపోయాయి. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అవతార్ సీక్వెల్ పై కూడా కరోనా ఎఫెక్ట్ పడింది.

ఇంతకుముందు చెప్పిన తేదీకి తమ సినిమా రాదని డిస్నీ ప్రకటించింది. లెక్కప్రకారం.. అవతార్-2 వచ్చే ఏడాది డిసెంబర్ లో రావాలి. ఇప్పుడీ సినిమాను మరో ఏడాది వాయిదా వేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. డిసెంబర్ 16, 2022న అవతార్-2 థియేటర్లలోకి వస్తుందని ప్రకటించింది.

ఇక ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్న అవతార్-3, అవతార్-4, అవతార్-5 కూడా ఏడాది పాటు వాయిదా పడ్డాయి. 2024లో అవతార్-3.. 2026లో అవతార్-4.. 2028లో అవతార్-5 వస్తాయని డిస్నీ ప్రకటించింది.

మరోవైపు తన ఫ్రాంచైజీ వాయిదాపై దర్శకుడు కేమరూన్ కూడా స్పందించాడు. అవతార్-2కు సంబంధించి న్యూజిలాండ్ లో షూటింగ్ స్టార్ట్ చేసినప్పటికీ.. అత్యంత కీలకమైన వర్చువల్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజిల్స్ లో ఆగిపోయిందని ప్రకటించాడు. దీని వల్ల తమ సీక్వెల్స్ అన్నీ ఏడాది ఆలస్యంగా థియేటర్లలోకి వస్తాయని తెలిపాడు.

ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్టయింది అవతార్ సినిమా. దీనికి సీక్వెల్ ను 2014లోనే ప్లాన్ చేసినప్పటికీ.. ప్రీ-ప్రొడక్షన్ వర్క్ తో పాటు అత్యాథునిక టెక్నాలజీని అందుకోవడానికి టైమ్ పట్టడంతో సీక్వెల్ లేట్ అయింది. అండర్ వాటర్ మోషన్ క్యాప్యూర్ సీక్వెన్సెస్ కోసం తమకు తాముగా ఓ కొత్త టెక్నాలజీని తయారుచేసుకున్నారు. దీని వల్ల సీక్వెల్ లేట్ అయింది. ఇప్పుడు కరోనాతో ఈ సీక్వెల్స్ అన్నీ మరో ఏడాది పాటు వాయిదాపడ్డాయి.

ఆర్జీవీకి సపోర్ట్ గా తరలి వచ్చిన ఫ్యాన్స్

నేను ఎప్పటికీ పవన్ భక్తుడినే