పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు పబ్లిక్ లోకి వచ్చారు. చాలా కాలం క్రితం తరువాత పవన్ లేటెస్ట్ ఫొటో బయటకు వచ్చింది. బాగా పెరిగిన జుట్టు, గుబురు గెడ్డం. లేత కాషాయి వస్త్రాలు, పైన అంగవస్త్రంతో అచ్చం ఓ స్వామీజీ మాదిరిగానో, ఇస్కాన్ కార్యకర్త మాదిరిగానో పవన్ దర్శనమిచ్చారు.
తన ఫ్యాన్ కమ్ హీరో నితిన్ ను పెళ్లి కొడుకును చేసిన సందర్భంగా పవన్ తన స్నేహితుడు త్రివిక్రమ్ తో, నిర్మాత నాగవంశీతో కలిసి వెళ్లివచ్చారు. ఈ సందర్భంగా పవన్ ను చూసిన వారంతా ఆశ్చర్య పోయారు. సినిమాల నుంచి రిటైర్ అయిన తరువాత సాధువులా మారిపోయినట్లు గా పవన్ కనిపించారు.
ప్రస్తుతం పవన్ చాతుర్మాస దీక్షలో వున్నారన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఉదయాన్నే గంట సేపు జపం చేస్తున్నారని తెలుస్తోంది. అలాగే అరగంట పూజ చేస్తారని బోగట్టా. చాలా కాలం క్రిందటే పవన్ జంధ్యం వేసుకుని, పూజలు చేయడం ప్రారంభించారని గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే కోవలో చాతుర్మాస దీక్ష కూడా చేస్తున్నారు. నిజంగా పవన్ ఓ డిఫరెంట్ పర్సనాలిటీ అనుకోవాలేమో? లేదా అనుకోవాలనేమో?