యంగ్ హీరో రామ్‌చరణ్ తాజా ట్వీట్ చర్చనీయాంశమైంది. `రంగస్థలం` సినిమాలోని తన ఫొటోను పోస్ట్ చేసిన రామ్‌చరణ్.. `నమ్మదగిన సమాచారాన్ని మాత్రమే వినండి` అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్‌పై ఎవరికి తోచినట్టు వారు అర్థాలు చెబుతున్నారు. తెల్లారితే పవర్‌స్టార్ సినిమా విడుదల కానుంది. పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేస్తూ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ తెరకెక్కించిన విషయం తెలిసిందే. పవన్‌ను డ్యామేజీ చేస్తూ వర్మ సినిమా తెరకెక్కించారని…ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండురోజుల క్రితం విడుదల చేసిన ట్రైలర్…ఆ సినిమా ఏ విధంగా ఉంటుందో చెప్పకనే చెబుతోంది.
ఈ నేపథ్యంలో సినిమా విడుదల నేపథ్యంలో చెర్రీ ట్వీట్ ఆసక్తి కలిగిస్తోంది. వర్మ తెరకెక్కించిన చిత్రం అభూతకల్పన అని యంగ్ హీరో చెప్పదలుచుకున్నాడని చర్చ జరుగుతోంది. చెర్రీ ట్వీట్‌పై సోషల్ మీడియాలో నెటిజన్ల మధ్య విస్తృత సాగుతోంది. బాబాయి కోసం మద్దతుగా అబ్బాయి రంగంలోకి దిగాడనే వాదన తెరపైకి తెచ్చారు. మరికొందరు తన సినిమాలపై రామ్‌చరణ్ ట్వీట్ చేశాడని అభిప్రాయపడుతున్నారు.