అదొక్కటి నేను చూపించలేను – శ్రీముఖి

శ్రీముఖి లైఫ్ కు సంబంధించి చాలా డీటెయిల్స్ ఆమె ఫ్యాన్స్ కు తెలుసు. ఆమె చేస్తున్న కార్యక్రమాలు, లైన్లో ఉన్న సినిమాల్ని ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు. వీటికి తోడు తన వ్యక్తిగత…

శ్రీముఖి లైఫ్ కు సంబంధించి చాలా డీటెయిల్స్ ఆమె ఫ్యాన్స్ కు తెలుసు. ఆమె చేస్తున్న కార్యక్రమాలు, లైన్లో ఉన్న సినిమాల్ని ఆమె అభిమానులు ఎప్పటికప్పుడు ఫాలో అవుతుంటారు. వీటికి తోడు తన వ్యక్తిగత విషయాల్ని, బిగ్ బాస్ సంగతుల్ని కూడా శ్రీముఖి ఎప్పటికప్పుడు బయటపెడుతూ ఉంటుంది. అయితే ఎన్ని విశేషాలు చెప్పినా, ఒకటి మాత్రం చూపించలేనంటోంది శ్రీముఖి. అవును.. తన ఇంటిని మాత్రం ఎవ్వరికీ చూపించనంటోంది శ్రీముఖి.

ఈ లాక్ డౌన్ టైమ్ లో అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సెలబ్రిటీలు, తారలంతా లైవ్ లో తమ ఇంటిని ఫ్యాన్స్ కు చూపిస్తున్నారు. చిరంజీవి లాంటి స్టార్ కూడా తన ఇంటిని అభిమానులకు పరిచయం చేశారు. ఇక నిహారిక అయితే ఏకంగా తన మేకప్ కిట్, బెడ్ రూమ్ ను కూడా చూపించేసింది. ఇలా హీరోహీరోయిన్లంతా తమ ఇళ్లు చూపిస్తుంటే.. శ్రీముఖి మాత్రం నో అంటోంది.

తన ఇల్లు, ఇంట్లో వస్తువులు చూపించడం తనకు ఇష్టం లేదంటోంది శ్రీముఖి. ఆ ఒక్కటి అడగొద్దు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తోంది. తన ఇల్లు, అందులో వస్తువులు చూపించడం తనకు ఇష్టం ఉండదని.. అయినా గతంలో ఓ న్యూస్ ఛానెల్ లో తన ఇంటిని చూపించారని.. ఇక చాలని అంటోంది ఈ బొద్దుగుమ్మ. బహుశా.. శ్రీముఖి ఇల్లు చిందరవందరగా ఉంటుందేమో.

ఆర్జీవీకి సపోర్ట్ గా తరలి వచ్చిన ఫ్యాన్స్

నేను ఎప్పటికీ పవన్ భక్తుడినే