కలర్ ఫుల్ వెడ్డింగ్: హీరోయిన్ పెళ్లి తంతు మొదలు

మరో సెలబ్రిటీ పెళ్లి వేడుక మొదలైంది. సౌత్ హీరోయిన్ హన్సిక పెళ్లి కూతురు కాబోతోంది. జైపూర్ లోని ఓ స్టార్ హోటల్ లో హన్సిక-సోహేల్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా మొదలైంది. Advertisement పెళ్లి…

మరో సెలబ్రిటీ పెళ్లి వేడుక మొదలైంది. సౌత్ హీరోయిన్ హన్సిక పెళ్లి కూతురు కాబోతోంది. జైపూర్ లోని ఓ స్టార్ హోటల్ లో హన్సిక-సోహేల్ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా మొదలైంది.

పెళ్లి కోసం ముంబయి నుంచి కుటుంబ సభ్యులతో కలిసి నిన్ననే జైపూర్ చేరుకుంది హన్సిక. ఈరోజు మెహందీ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

స్వయంగా హన్సిక కూడా కొన్ని ఫొటోల్ని షేర్ చేసింది. ముంబయికి చెందిన డిజైనర్లు చేతులకు మెహందీ పెడుతుండగా దిగిన ఫొటోను షేర్ చేసింది. ఇక ఓ వీడియోలో రెహ్మాన్ పాటలకు కూర్చొని డాన్స్ చేసింది హన్సిక. పక్కనే సోహేల్ కూడా ఉన్నాడు.

రేపు హన్సిక-సోహేల్ పెళ్లి రెండో ఘట్టానికి చేరుతుంది. గ్రాండ్ గా సంగీత్ కు ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ ఫంక్షన్ లో పలువురు సెలబ్రిటీలు కనిపించే అవకాశం ఉంది. ఇక ఆదివారం.. హన్సిక-సోహెల్ వివాహబంధంలోకి అడుగుపెడతారు. ఇలా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది హన్సిక పెళ్లి.

పెళ్లికి ముందు తన క్లోజ్ ఫ్రెండ్స్ కు గ్రాండ్ గా పార్టీ ఇచ్చింది హన్సిక. ఏకంగా వాళ్లందర్నీ గ్రీస్ కు తీసుకెళ్లి మరీ పార్టీ ఇచ్చింది. పెళ్లి తర్వాత తిరిగి తన సినిమాలతో బిజీ కాబోతోంది. ప్రస్తుతం హన్సిక నటించిన మై నేమ్ ఈజ్ శృతి, 105, పార్టనర్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మరో 5 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. పెళ్లి తర్వాత కూడా కెరీర్ ను కొనసాగించబోతోంది ఈ బ్యూటీ.