కథ డిమాండ్ చేస్తే నైట్ షిఫ్ట్ చేయాల్సిందే. నైట్ ఎఫెక్ట్ లో సన్నివేశాలు తీయాల్సి వచ్చినప్పుడు ఒక్కోసారి రాత్రి 2 కూడా అవుతుంది. సీనియర్ ఆర్టిస్టులు ఇలాంటివి ఎవాయిడ్ చేస్తుంటారు. సీరియారిటీ వల్ల లేదా వయసురీత్యా నైట్ షూటింగ్స్ కు చాలామంది ఓకే చెప్పరు. కానీ మధుబాల మాత్రం ఏరికోరి నైట్ షిఫ్ట్ చేసిందట.
తాజాగా మధుబాల నటించిన సినిమా ఒకటి ఓటీటీలో రిలీజైంది. దీని పేరు రిపీట్. థ్తిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కొన్ని నైట్ షాట్స్ ఉన్నాయి. వాటి కోసం నవీన్ చంద్రతో పాటు మరికొంతమంది నటీనటులు చాలా రాత్రులు గడపాల్సి వచ్చింది. నిజానికి ఈ షెడ్యూల్ లో మధుబాల లేదు.
అయితే యూనిట్ పడిన కష్టాన్ని చూసి తను కూడా 2 రాత్రులు వాళ్లతో గడిపిందట మధుబాల. అలా యూనిట్ కు తన మద్దతు ప్రకటించింది. ఈ విషయాన్ని నవీన్ చంద్ర వెల్లడించాడు. అంత సీనియర్ నటి తమ కోసం రాత్రిపూట లొకేషన్ లో ఉండడం ఆశ్చర్యంగా, చాలా స్ఫూర్తిదాయకంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు.
రీఎంట్రీలో బ్రేక్ కోసం మధుబాల గట్టిగా ప్రయత్నిస్తోంది. మంచి పాత్రలు కూడా పోషిస్తోంది. కానీ నదియా టైపులో ఆమెకు స్టార్ డమ్ రావడం లేదు. క్యారెక్టర్ రోల్స్ లో కూడా ప్రస్తుతం పోటీ గట్టిగా ఉందంటున్న మధుబాల, రాసిపెట్టి ఉంటే ఏదో ఒక రోజు స్టార్ డమ్ వస్తుందని నమ్మకంగా చెబుతోంది.
అన్నట్టు ఈ సీనియర్ నటికి కామెడీ, విలనీ రోల్స్ చేయాలని ఉందంట. ఆ టైపు పాత్రలుంటే ఇవ్వమని మీడియాముఖంగా విజ్ఞప్తి చేస్తోంది.