ఆ విషయంలో ఆర్జీవీ తర్వాతే పవన్

12 గంటలు గడచి 24 గంటలకు చేరవవుతున్నా పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ పార్ట్-1 కి వచ్చిన వ్యూస్ 2 లక్షలకు అటుఇటు మాత్రమే.. 24 గంటలు గడిచేలోపు ఆర్జీవీ 'పవర్ స్టార్' ట్రైలర్ కి…

12 గంటలు గడచి 24 గంటలకు చేరవవుతున్నా పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ పార్ట్-1 కి వచ్చిన వ్యూస్ 2 లక్షలకు అటుఇటు మాత్రమే.. 24 గంటలు గడిచేలోపు ఆర్జీవీ 'పవర్ స్టార్' ట్రైలర్ కి వచ్చిన వ్యూస్ మాత్రం 24 లక్షలు. ఇలా వ్యూస్ పరంగా చూసుకుంటే పవన్ మీద రామ్ గోపాల్ వర్మదే పైచేయి అని చెప్పాలి.

పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూ అన్ని వర్గాలను నిరాశపరచిన మాట వాస్తవమే కానీ. మరీ ఇంత దారుణమైన వ్యూస్ తెచ్చుకుంటుందని ఎవరూ అనుకోలేదు. అయితే నిన్న ఇంటర్వ్యూ బైటకొచ్చిన గంటసేపటి తర్వతా లక్ష వ్యూస్ అంటూ ఘనంగా ప్రకటించింది జనసేన. అయితే ఆ లక్ష తర్వాత ముక్కీ మూలిగా 2 లక్షలు చేరుకోడానికి కునారిల్లుతూ నడుస్తోంది.

మరోవైపు వర్మ ట్రైలర్ మాత్రం 24 గంటల్లోపే 24లక్షల వ్యూస్ దాటేసింది. 30 లక్షలు, 35 లక్షలు అంటూ దాన్ని అప్ డేట్ చేసుకుంటూ వర్మ పవన్ ఫ్యాన్స్ ని మరింతగా రెచ్చగొడుతున్నాడు. కనీసం ఈ విషయంలో జనసేన జనాలు తమ అధినేత ఇంటర్వ్యూకు వస్తున్న వ్యూస్ ను పైకి చెప్పుకోకుండా ఉన్నా సరిపోయేది. వాళ్లు లెక్కలు తీయడంతో, పవర్ స్టార్ ట్రయిలర్ వ్యూస్ గురించి కూడా మాట్లాడాల్సి వస్తోంది.

వాస్తవానికి వర్మ టీజర్ తో పవన్ కల్యాణ్ ఇంటర్వ్యూకి పోలికే లేదు. ఇంటర్వ్యూ విడుదలకు ముందు దానిపై ఆసక్తి ఉన్నా.. అది బైటకొచ్చాక అంతా చచ్చిపోయింది. ఐదు నిముషాల్లోపే వీడియోని స్కిప్ చేసినవాళ్లు చాలామందే ఉన్నారు. అయితే వ్యూస్ మరీ ఇంత ఘోరంగా ఉంటాయని ఎవరూ ఊహించలేదు. పవన్ కల్యాణ్ పుట్టినరోజుకి నెలన్నర రోజుల ముందే హడావిడి చేసిన బ్యాచ్ ఎటుపోయింది?

అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే పవన్ కల్యాణ్ అంటూ హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేయడంలో ఉన్న శ్రద్ధ, కనీసం పవన్ చెప్పే మాటలపై అభిమానులకు ఉందా? పోనీ అలాంటి మోటివేషనల్ స్పీచ్ ఏదైనా పవన్ ఇచ్చారా? యథారాజా, తథాప్రజా. పవన్ ఎలా లక్ష్యం లేకుండా వెళ్తున్నారో, అభిమానులు అంతకంటే నిర్లక్ష్యంగా ఉన్నారు. కనీసం వర్మ మీద వేసే నెగెటివ్ ట్వీట్ లపై పెట్టిన శ్రద్ధ, పవన్ ఇంటర్య్యూని షేర్ చేయడంపై పెట్టుంటే.. మంచి వ్యూస్ వచ్చేవి. అసలు ఇంటర్వ్యూలో కంటెంట్ లేకపోవడంతో అభిమానులు కూడా లైట్ తీసుకున్నారని అర్థమవుతోంది. 

'మై స్టార్ ఈజ్ మోర్ పవర్ ఫుల్ దేన్ పవర్ స్టార్'. బస్తీమే సవాల్.. అంటూ ఇదివరకే పవన్ కల్యాణ్ ని, ఆయన అభిమానుల్ని వర్మ రెచ్చగొట్టారు. ఇప్పుడు ఆయన ఇంటర్వ్యూకి, తన టీజర్ వ్యూస్ కి కంపేర్ చేస్తూ మరింతగా రెచ్చగొడుతున్నారు. కనీసం పవన్ ఇంటర్వ్యూ పార్ట్-2 అయినా కాస్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి. 

ఆర్జీవీకి సపోర్ట్ గా తరలి వచ్చిన ఫ్యాన్స్