ఎయిర్ పోర్ట్ పక్కనే ఎగ్జిక్యూటివ్ కాపిటల్?

జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖలో రాజధాని కోసం పక్కాగా ప్లాన్ రెడీ చేస్తోంది. అన్ని విధాలుగా రాజధానికి రాజసాన్ని తీసుకువచ్చేలా చూస్తోంది. ఒక రాజధానికి కావాల్సింది రవాణా కనెక్టివ్టీ.  దాని కోసం…

జగన్ సర్కార్ వేగంగా అడుగులు వేస్తోంది. విశాఖలో రాజధాని కోసం పక్కాగా ప్లాన్ రెడీ చేస్తోంది. అన్ని విధాలుగా రాజధానికి రాజసాన్ని తీసుకువచ్చేలా చూస్తోంది. ఒక రాజధానికి కావాల్సింది రవాణా కనెక్టివ్టీ.  దాని కోసం ముందే అన్ని రకాలా ఏర్పాట్లు చేస్తోంది.

విశాఖను ఆనుకుని భోగాపురంలో ఇంటెర్నేషనల్ ఎయిర్ పోర్టుకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. దీన్ని జీఎమ్మార్ సంస్థకు అప్పగించారు. మూడేళ్ళ కాల వ్యవధిలో ఈ ఎయిర్ పోర్ట్ తయారవుతుంది. ఇక దీని కోసం సేకరించిన మూడు వేల ఎకరాల భూముల్లొ అయిదు వందల ఎకరాలు ప్రభుత్వం ఉంచుకుంది. మిగతా భూముల్లోనే ఎయిర్ పోర్టు వస్తుందన్న మాట.

ఈ అయిదు వందల ఎకరాల్లో కోర్ క్యాపిటల్ నిర్మాణం చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉందని అంటున్నారు. దీనితో పాటు చుట్టుపక్కల మరో వేయి నుంచి పదిహేను వందల ఎకరాలను తీసుకుని మొత్తంగా అభివ్రుధ్ధి చేస్తే అందమైన ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తయారవుతుందని అంటున్నారు.

ఈ క్యాపిటల్ సిటీకి సమీపంలో  ఇంటర్నేషనల్ ఎయిr పోర్టు ఉంటుంది. దాంతో పాటు సీ, రోడ్డు  రైల్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇక మెట్రో రైల్ ప్రాజెక్ట్ తో విశాఖ సిటీని మొత్తం కలుపుకుంటే అధ్బుతమైన పాలనా రాజధాని అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక ఇక్కడ ఎంపిక చేసిన స్థలాన్ని బట్టి చూస్తే అటు విజయనగరం, శ్రీకాకుళానికి  జిల్లాలకు కూడా వీలుగా ఉంటుంది. మొత్తానికి జగన్ కలల రాజధానికి సంబంధించి చక్కనైన యాక్షన్ ప్లాన్ కూడా రెడీ అవుతోంది.

ఆర్జీవీకి సపోర్ట్ గా తరలి వచ్చిన ఫ్యాన్స్

నేను ఎప్పటికీ పవన్ భక్తుడినే