టాలీవుడ్ మీద జగన్ దృష్టి పెడతారా?

ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత జగన్ ఇప్పటి వరకు టాలీవుడ్ వ్యవహారాల మీద దృష్టి పెట్టలేదు. వైకాపాకు ప్రచారం చేసిన ఒకరిద్దరికి పదవులు ఇవ్వడం మినహా మరేం పట్టించుకోలేదు. టాలీవుడ్ తరలింపు లాంటి కీలక వ్యవహారాల…

ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత జగన్ ఇప్పటి వరకు టాలీవుడ్ వ్యవహారాల మీద దృష్టి పెట్టలేదు. వైకాపాకు ప్రచారం చేసిన ఒకరిద్దరికి పదవులు ఇవ్వడం మినహా మరేం పట్టించుకోలేదు. టాలీవుడ్ తరలింపు లాంటి కీలక వ్యవహారాల జోలికి పోవచ్చు కానీ, టాలీవుడ్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచే విషయమై జగన్ దృష్టి సారించబోతున్నారని బోగట్టా.

రాష్ట్ర ఖజానాను గత ప్రభుత్వం దాదాపు ఖాళీ చేసి వెళ్లింది. జగన్ తలపెట్టిన అనేకానెక పథకాలకు డబ్బులు కావాలి. అందులో బాగంగా ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థను ప్రభుత్వం తీసుకునే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇఫ్పటికే ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నే స్వయంగా ప్రకటించారు.

థియేటర్లను గుప్పిట్లో వుంచుకున్న కొందరు పన్నుల ఎగవేతకు విపరీతంగా పాల్పడుతున్నారని గతంలో అనేకసార్లు నట్టికుమార్ లాంటి నిర్మాతలు అనేకసార్లు బాహాటంగా ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఈ విషయంలో గట్టిచర్యలు తీసుకుంటే ఆదాయం పెరుగుతుందని ఆయన అనేకసార్లు అన్నారు.

ఇప్పుడు ఆ విషయం మీదే దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం టికెట్ ల అమ్మకాల వ్యవహారాన్ని ప్రభుత్వం టేకప్ చేసి, పన్నులు మినహాయించి, వెనక్కు ఇచ్చేలా చేయడానికి ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నట్ల బోగట్టా. థియేటర్ల వ్యవస్థలో కీలకంగా వున్నది తెలుగుదేశణ మద్దతుదార్లు అయిన సినిమా పెద్దలే. ఇప్పుడు ఇలాచేయడం వల్ల వీరంతా ఇరుకునపడే అవకాశం వుంది.

జగన్ ను టాలీవుడ్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా గుర్తించిన దాఖలానే లేదు. గెలిచిన తరువాత కలవడం కానీ, లేదా అభినందించడం కానీ చేసిందిలేదు. ఈ విషయం మీద పృధ్వీ లాంటివాళ్లు బాహాటంగానే ధ్వజమెత్తారు. అప్పటికీ ఇండస్ట్రీ పెద్దలు స్పందించలేదు.

కీలకమైన వారైన అల్లు అరవింద్ జనసేన అధినేతకు బంధువు. సురేష్ బాబు తెలుగుదేశం మద్దతుదారు. దిల్ రాజుకు మాత్రం ఇటీవల కొంతవరకు వైకాపాతో సంబంధాలు ఏర్పడ్డాయి. జగన్ ప్రమాణ స్వీకారానికి కూడా ఆయన వెళ్లి వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో జగన్ టాలీవుడ్ పై దృష్టిపెడితే తీసుకునే చర్యలు ఎలావుంటాయో చూడాలి.

చిరంజీవి గారి వల్లనే అవన్నీ సాధ్యం అయ్యాయి