ఆగస్ట్ 8న రానా-మిహీకా పెళ్లితో ఒకటి కాబోతున్నారు. పెళ్లికి సంబంధించిన షాపింగ్ కు చాలా రోజుల కిందటే మొదలుపెట్టింది ఈ జంట. ఇప్పుడీ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతోంది. వీడియో రూపంలో ఈ వెడ్డింగ్ కార్డ్ ను డిజైన్ చేశారు. దీని కోసం మాయాబజార్ థీమ్ ను ఎంచుకున్నారు.
మాయాబజార్ సినిమాలో మాయాపేటిక కాన్సెప్ట్ ను తీసుకొని వీడియో వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేశారు. మేజిక్ బాక్స్ తెరిచిన వెంటనే రానా-మిహీకాల ఫొటోలు, వాళ్ల పెళ్లికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేలా దీన్ని డిజైన్ చేశారు.
వీడియో ప్రకారం.. ఆగస్ట్ 8న మధ్యాహ్నం 2 గంటలకు రానా-మిహీకాల పెళ్లి జరుగుతుంది. హైదరాబాద్ మణికొండలోని చైతన్య ఎన్ క్లేవ్ లో రానా-మిహీకాల పెళ్లి జరగనుంది. లాక్ డౌన్ నిబంధనలకు తగ్గట్టు తక్కువమంది అతిథుల సమక్షంలో ఈ పెళ్లి వేడుక జరిపించబోతున్నారు.
పెళ్లికి సంబంధించి త్వరలోనే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించబోతున్నారు సురేష్ బాబు. పెళ్లికి పిలవాల్సిన 30 మంది అతిథుల లిస్ట్ ను సురేష్ బాబు తయారుచేశారు. వాళ్లకు ఈ ప్రత్యేకమైన వెడ్డింగ్ కార్డులు ఇచ్చి ఆహ్వానించబోతున్నారు.