బాలకృష్ణ అన్ స్టాపబుల్ 2 ఇప్పటి వరకు చూసుకుంటే ఫ్లాప్ షో నే. తొలి సీజన్ సూపర్ హిట్. మలి సీజన్ యావరేజ్ కూడా కాలేకపోతోంది. దానికి ఒక కారణంగా కాదు. చాలా కారణాలు వున్నాయి. సరైన గెస్ట్ లు దొరక్కపోవడం అసలు కారణం. అందువల్లే వారం విడివి వారం వచ్చే షో కానీ, ప్రోమోలు కానీ పెద్దగా ఆకట్టుకోవడం లేదు. అయితే ఈవారం కట్ చేసి వదిలిన ప్రోమో ఆసక్తి దాయకంగానే వుంది.
అల్లు అరవింద్..దగ్గుబాటి సురేష్ బాబులు ఈ ప్రోమోలో కీలకంగా కనిపించారు. నిలయ విద్వాంసుడు రాఘవేంద్రరావు సంగతి సరేసరి. సమాధానాలు ఏమి వచ్చి వుంటాయో అన్నది పక్కన పెడితే సినిమాల్లో వారసత్వాలు… వెంకటేష్ తో సురేష్ బాబుకు, బన్నీతో అరవింద్ కు వుండే సమస్యలు ఇలా ఇంట్రస్టింగ్ పాయింట్లు పడ్డాయి ప్రొమోలో. ‘నాకు ఎన్ని థియేటర్లు ఇస్తున్నారు పండగకు’ అని బాలయ్య అరవింద్ ను అడగడం కూడా ఇంటస్ట్రింగ్ గా వుంది.
అంతా బాగానే వుంది కానీ ముందుగా ప్రోమోలో సెలబ్రేటింగ్ 90 ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా అంటూ కేవలం ఎన్టీఆర్ కట్ అవుట్ లు మాత్రమే చూపించడం అస్సలు బాగా లేదు. మహా మహులు చిత్తూరు నాగయ్య నుంచి ఎన్టీఆర్, ఏఎన్నార్, ఎస్వీఆర్ మీదుగా ఎందరో వున్నారు.
ఎన్టీఆర్ వందేళ్ల సంబరాలు అంటే అది వేరు. సెలబ్రేటింగ్ తెలుగు సినిమా అన్నపుడు ఎన్టీఆర్ మాత్రమే అంటే అది ముమ్మాటికీ తప్పే. బాలయ్య హొస్ట్ అయినంత మాత్రాన ఎఎన్నార్, కృష్ణ లాంటి వాళ్లను మరిచిపోతే ఎలా?