దూకుడు+అతడు = సరిలేరు

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో దూకుడు, అతడు ప్రత్యేకమైనవి. దూకుడులో ఎంటర్ టైన్ మెంట్ పార్ట్, అలాగే అతడు సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్లు కీలకమైనవి. ఇప్పుడు ఆ రెండు సినిమాల్లోని ఆ కీలకమైన…

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో దూకుడు, అతడు ప్రత్యేకమైనవి. దూకుడులో ఎంటర్ టైన్ మెంట్ పార్ట్, అలాగే అతడు సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్లు కీలకమైనవి. ఇప్పుడు ఆ రెండు సినిమాల్లోని ఆ కీలకమైన విషయాలు గుర్తుకువచ్చేలా రూపొందుంతోందంట సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి డైరక్షన్ లో ముస్తాబవుతున్న సరిలేరు నీకెవ్వరు గురించి ఇండస్ట్రీలో వినిపిస్తున్న సంగతులు చాలా ఆసక్తికరంగా వున్నాయి.

సినిమా తొలిసగం అంతా దూకుడు మాదిరిగా ఫుల్ ఎంటర్ టైనర్ గా సాగుతుందట. మలిసగం అంతా ఫ్యామిలీ ఎమోషన్లు, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ తో వుంటుందట. సినిమాలో విజయశాంతి పాత్ర ఎలా వుంటుందీ అంటే రెండు రకాలుగా చెప్పుకోవాలని టాక్. ఒకటి అతడు సినిమాలో నాజర్ పాత్ర విజయశాంతి చేస్తే ఎలా వుంటుందో అలా. లేదా ప్రతిఘటన సినిమాలో లెక్చరర్ విజయశాంతి రిటైర్ అయిపోతే ఎలా వుంటుందో అలా.

విజయశాంతికి ఈ సినిమా పక్కా కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందని టాక్ వినిపిస్తోంది. అలాగే కమెడియన్ల కొరత వున్న టాలీవుడ్ కు బండ్ల గణేష్ పాత్రతో మళ్లీ అతనికీ కమ్ బ్యాక్ పిల్మ్ అవుతుందని తెలుస్తోంది.
సినిమాలో కీలక ట్రయిన్ ఎపిసోడ్ లెంగ్తీగానే వుంటుందని, అయితే అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనీగా వుంటుందని తెలుస్తోంది.

సాధారణంగా అనిల్ రావిపూడి సినిమాల్లో కథ కన్నా, నెరేషన్, మాస్ ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువగా వుంటుంది అని అంటారు. కానీ ఈ సినిమాతో అనిల్ రావిపూడి మంచి కథకుడు అని కూడా అనిపించుకుంటాడని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఆ విధంగా రెండు రకాలషేడ్స్ వున్న కథను రాసుకున్నాడట. అందువల్ల సినిమా తొలిసగం అంతా ఓ జోనర్ లా, మలిసగం అంతా మరో జోనర్ లా చేసి, రెండుచోట్లా కూడా ఎంటర్ టైన్ మెంట్ మాత్రం మిస్ కాకుండా చూసుకున్నాడట దర్శకుడు.

ఈ సినిమాను జనవరి 11న విడుదల చేస్తారన్నది ప్రస్తుతానికి వినిపిస్తున్న మాట. ఇంకా అధికారికంగా డేట్ అయితే ప్రకటించలేదు.