సినిమాలో వదిలేసి బయట చూపించారు

గద్దలకొండ గణేష్. వరుణ్ తేజ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. ఈ సినిమా మీద మిక్స్ డ్ రిపోర్టు వుంది. సినిమాలో ఎక్కడా సరైన ఫైట్ పెట్టలేదన్న కంప్లయింట్ కూడా వుంది. వరుణ్…

గద్దలకొండ గణేష్. వరుణ్ తేజ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా. ఈ సినిమా మీద మిక్స్ డ్ రిపోర్టు వుంది. సినిమాలో ఎక్కడా సరైన ఫైట్ పెట్టలేదన్న కంప్లయింట్ కూడా వుంది. వరుణ్ తేజ్ లాంటి హీరోను వుంచుకుని, మాస్ సినిమాలో మాంచి ఫైట్ పెట్టకుండా తుపాకులు, కత్తులు వాడారు అన్న ఫీల్ వుంది.  ఈసినిమా తొలి నాలుగు రోజులు తరువాత కలెక్షన్ల పరంగా కిందకు జారింది. రెండోవారం వీకెండ్ ప్రేక్షకులు కరుణిస్తేనే బయ్యర్లు బ్రేక్ ఈవెన్ అయ్యేది.

అందుకే ప్రచారం ముమ్మరం చేసారు. సినిమాలో డిలీటెడ్ సీన్ అంటూ నిమిషంన్నర విడియో వదిలారు. ఈ ఫుటేజ్ ఎక్స్ లెంట్ గా వుంది. సినిమాలో ఏ ఫైట్ సీన్ అయితే లేదని ప్రేక్షకులు ఫీలయ్యారో, అలాంటి ఫైట్ సీన్ ఇది. గద్దలకొండ గణేష్ సినిమాలో షూటింగ్ జరుగుతుండగా అతనిపై హత్యా యత్నం జరిగిన సీన్ ఇది.

నిమిషంన్నర సీన్ అయినా బాగుంది. పవర్ ప్యాక్డ్ గా వుంది. నిజానికి ఇలా డిలీటెడ్ సీన్ గా వదిలేబదులు, సినిమాలో ఆ మేరకు ఏదయినా డిలీట్ చేసి, ఇది యాడ్ చేసుకుని వుంటే మరింత బాగుండేదేమో? కానీ అలా చేయకుండా మెగా ఫ్యాన్స్ యూట్యూబ్ లో చూడడానికి వీలుగా వదిలేసారు. ఈ లైన్ లో మరిన్ని డిలీటెడ్ సీన్లు రానున్నాయని బోగట్టా.