ప్రముఖ వివాదాస్పద, సంచలన దర్శకుడు రాంగోపాల్‌వర్మను ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె ప్రశంసించాడు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో సినిమాను మార్కెటింగ్ చేయడంలో వర్మ ఫాలో అవుతున్న విధానాలను ఆయన కొని యాడాడు. కరోనా సమయంలో సినిమాలు విడుదల కాకపోవడం, షూటింగ్‌లు జరగకపోవడం తదితర కారణాలతో పెద్దపెద్ద నిర్మాతలే దిక్కుతోచక తలలు పట్టుకుంటున్నారన్నాడు.
కొన్ని సినిమాలు ముందుకు సాగక, అలాగని అడ్వాన్స్‌లు తిరిగి వచ్చే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతల పరిస్థితి దయనీయంగా మారిందన్నాడు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లో రాంగోపాల్‌వర్మ తన సినిమాలకు విజయవంతంగా మార్కెటింగ్ చేసుకుంటున్నా డన్నాడు. వర్మను అందరూ ఫాలో కావాల్సిందేనని ఆయన సూచించాడు.
చిత్ర పరిశ్రమ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వర్మ ఆదాయాన్ని రాబడుతుండడం అభినందించదగ్గ విషయమే అన్నాడు. అయితే రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన పవర్‌స్టార్ చిత్రాన్ని తాను చూడదలచుకోలేదన్నాడు. ట్రైలర్‌కు టికెట్ అని చెప్పక పోయి ఉంటే తప్పక చూసి ఉండేవాడినని ఆయన చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా కరోనా మహమ్మారి సమయంలో సినిమాను వాణిజ్య పరంగా సక్సెస్ సాధించడం , ఆదాయం రాబట్టడం ఆర్జీవీ తెలివితేటలకు నిదర్శనమని రఘు కుంచె మరోసారి ప్రశంసించాడు.