కులం కార్డు అంత ముఖ్యమనుకున్నారా.. జగన్?!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన, చిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఎమ్మెల్యేగా పోటీచేయించడానికి డిసైడ్ చేశారు.  Advertisement ఎంపీలు- ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలు- ఎంపీలుగా పోటీచేయడం..…

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమైన, చిత్రమైన నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను ఎమ్మెల్యేగా పోటీచేయించడానికి డిసైడ్ చేశారు. 

ఎంపీలు- ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలు- ఎంపీలుగా పోటీచేయడం.. పార్టీ అవసరాల కోసం ఈ జంబ్లింగ్ జరుగుతూ ఉండడం రాజకీయాల్లో కొత్త సంగతి కాదు. కాకపోతే.. అలాంటి విశాఖ జంబ్లింగ్ కు ముఖ్యమంత్రి జగన్ ‘కులం కార్డు’ ఒక్కటే ప్రాతిపదికగా ఎంచుకున్నారా? అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా ఉంది.

విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సదా వార్తల్లో వ్యక్తి. కుటుంబం కిడ్నాప్ కు గురైన సందర్భంలో ఆయన బహుధా వార్తల్లోకి వచ్చారు. రాజకీయాలు వదిలేసి .. హైదరాబాదు వెళ్లిపోయి వ్యాపారం చేసుకుంటూ బతకాలని ఉందంటూ వాపోయారు. అయితే, ఆయన భూదందాల గురించి ప్రత్యర్థులు తీవ్రమైన ఆరోపణలు చేస్తుంటారు. చర్చి భూములు కాజేశారనే నిందలు కూడా ఆయనపై ఉన్నాయి. 

రాజకీయాలు మానుకుని, హైదరాబాదు వెళ్లిపోవాలని ఉన్నదని అన్న మాటలను పట్టుకుని ప్రత్యర్థులు జగన్ పాలనను నిందించే ప్రయత్నం చేశారు. సొంత ఎంపీనే ఈ రాష్ట్రంలో ఉండలేకపోతున్నారని అన్నారు. అలా పార్టీ పరువు తీసినందుకు జగన్ ఎంవీవీ మీద గుస్సా అవుతున్నారని, ఈసారికి ఎంపీ టికెట్ దక్కకపోవచ్చునని కూడా ప్రచారం జరిగింది.

అయితే అనూహ్యంగా వచ్చే ఎన్నికల్లో ఎంవీవీని విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దించడానికి ప్రయత్నం జరుగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఆ స్థానంలో టికెట్ ఆశిస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్ ను ఎంపీ బరిలో దించుతారని కూడా అంటున్నారు. ఇలాంటి మార్పు నిర్ణయం వెనుక జగన్ వ్యూహం గురించి చర్చ జరుగుతోంది. 

అయితే గత ఎన్నికల్లో రాష్ట్రమంతా జగన్ హవా వీచినప్పటికీ.. విశాఖ తూర్పులో తెదేపాకు చెందిన వెలగపూడి రామకృష్ణ బాబు 26వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. అలాంటి సీటులో వైసీపీ నెగ్గాలంటే.. అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని మోహరించడం ఒక్కటే మార్గంగా జగన్ భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఆయన ఎంపీ ఎంవీవీ ని ఎమ్మెల్యే బరిలోకి దించుతున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు.