సురేందర్ రెడ్డి – ఆరెస్సెస్

డైరక్టర్ సురేందర్ రెడ్డి సినిమా ప్రియులకు అందరికీ పరిచయమే. ఆయన సినిమాలు, హిట్ లు, ఫ్లాపులు అన్నీ పరిచయమే. అయితే ఆయనది ఆరెస్సెస్ నేపథ్యం అని, చిన్నతనం నుంచి ఆయన చదివింది ఆరెస్సెస్ నేపథ్యం…

డైరక్టర్ సురేందర్ రెడ్డి సినిమా ప్రియులకు అందరికీ పరిచయమే. ఆయన సినిమాలు, హిట్ లు, ఫ్లాపులు అన్నీ పరిచయమే. అయితే ఆయనది ఆరెస్సెస్ నేపథ్యం అని, చిన్నతనం నుంచి ఆయన చదివింది ఆరెస్సెస్ నేపథ్యం వున్న విద్యాసంస్థల్లో అని ఇప్పుడు బయటకు వచ్చింది. గ్రేట్ ఆంధ్రకు ఎక్స్ క్లూజివ్ గా ఇచ్చిన ఇంటర్వూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. దీంతో ఇప్పుడు ఆ ఇంటర్వూలో ఆ పార్ట్ మేరకు కట్ చేసి, ఆరెస్సెస్ అభిమానులు, సిద్దాంత వాదులు తమ తమ ఫేస్ బుక్ వాల్స్ మీద పోస్ట్ చేయడం, షేర్ చేయడం చేస్తున్నారు.

రకరకాల పేర్లతో ఆరెస్సెస్ నేపథ్యం వున్న విద్యాసంస్థలు దశాబ్దాల కాలంగా నడుస్తున్నాయి. ఒకప్పుడు ఈ విద్యాసంస్థల్లో అడ్మిషన్ దొరకాలంటే కష్టంగా కూడా వుండేది. నైతిక విలువులు, నీతి, సేవ ఇలాంటివి అన్నీ చదువుతో కలిపి నేర్పేవి ఈ సంస్థలు. అయితే రాను రాను కార్పొరేట్ స్కూళ్లు పెరిగాక, వీటి గురించి బయటకు తెలియడం తగ్గింది. మిడిల్ క్లాస్ ఏరియాల్లో, చాలా ఊళ్లలో ఇప్పటకీ ఇవి నడుస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో సురేందర్ రెడ్డి విద్యా నేపథ్యం బయటకు రావడంతో, ఫేస్ బుక్ ల్లో ఈ ఇంటర్వూ క్లిప్స్ దర్శనమిస్తున్నాయి.