వివాదాల్లో దర్శకుడు రాంగోపాల్‌వర్మ, నటి శ్రీరెడ్డి ఇద్దరికి ఇద్దరే అని చెప్పొచ్చు. క్యాస్టింగ్ కౌచ్ పోరులో శ్రీరెడ్డి ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం ‘పవర్‌స్టార్’ వెబ్ సిరీస్ తెరకెక్కించి పవన్‌కల్యాణ్‌పై మరోసారి వర్మ తన అక్కసు వెళ్లగక్కాడు. క్యాస్టింగ్ కౌచ్‌పై ఉధృతంగా పోరు సాగుతున్న సమయంలో పవన్‌పై శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారం రేపింది. దీంతో అప్పట్లో శ్రీరెడ్డి పోరాటం ఒక్క సారి టర్న్ తీసుకోంది. పవన్‌పై శ్రీరెడ్డి విమర్శల వెనుక వర్మ ఉన్న విషయం ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది.
పవన్ కల్యాణ్‌పై వ్యతిరేకతే వర్మపై అంటే శ్రీరెడ్డికి అభిమానం పెంచింది. తాజాగా మరోసారి వర్మపై తన ఇష్టాన్ని శ్రీరెడ్డి చాటారు. ఈ మేరకు ఆమె ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. పవర్‌స్టార్ అంటూ వర్మ తీస్తున్న సినిమాకు కౌంటర్‌గా కొందరు పవన్‌కల్యాణ్ అభిమానులు ‘పరాన్నజీవి’ అనే టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాపై శ్రీరెడ్డి స్పందించారు. ఈ సినిమాలో నటించాలని తనపై ఎంతో ఒత్తిడి చేశారని, కానీ అంగీకరించలేదని ఆమె చెప్పారు. రాంగోపాల్‌వర్మపై ఇష్టం వల్లే ఆ సినిమాలో నటించేందుకు నో అని చెప్పాల్సి వచ్చిందన్నారు. తనకు కొన్ని విలువలున్నాయని ఆమె తెలిపారు.
కేవలం డబ్బే కావాలనుకుంటే.. సంపాదించుకునేందుకు అనేక మార్గాలున్నాయని శ్రీరెడ్డి తెలిపారు. కానీ తన సొంతవాళ్ల గౌరవానికి ఎప్పుడూ ఇబ్బంది కలిగించకూడదనే ఉద్దేశంతో ‘పరాన్నజీవి’ సినిమాలో నటించలేదన్నారు. సొంతవాళ్లని తాను భావించే వాళ్లు…తనను ఇష్టపడినా, పడకపోయినా పట్టించుకోనని స్పష్టం చేశారు. శ్రీరెడ్డి మాటలను బట్టి రాంగోపాల్‌వర్మను తన సొంత మనిషిగా భావిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. శ్రీరెడ్డి మనసులో రాంగోపాల్‌వర్మకు సొంత మనిషి అనే స్థానం కల్పించింది.
పవర్‌స్టార్ సినిమాలో గడ్డితిన్నావా సాంగ్ తనకెంతో నచ్చిందని శ్రీరెడ్డి తెలిపారు. ఆ సాంగ్‌ను తీర్చిదిద్దిన ఆర్జీవీకి ఆమె కృత జ్ఞతలు తెలిపారు.