నాకు మంచి బాడీ ఉంది.. అనసూయ

యాంకర్ అనసూయ మరోసారి ఫైర్ అయింది. ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన ఈ జబర్దస్త్ బ్యూటీ.. గ్లామర్ డ్రెస్సులు వేసుకుంటే తప్పేంటని ప్రశ్నించింది. తనకు సెక్సీ బాడీ ఉందని, కాబట్టి సెక్సీ డ్రెస్సులు…

యాంకర్ అనసూయ మరోసారి ఫైర్ అయింది. ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేసిన ఈ జబర్దస్త్ బ్యూటీ.. గ్లామర్ డ్రెస్సులు వేసుకుంటే తప్పేంటని ప్రశ్నించింది. తనకు సెక్సీ బాడీ ఉందని, కాబట్టి సెక్సీ డ్రెస్సులు వేసుకుంటున్నానని చెప్పుకొచ్చింది. పెళ్లికి, మోడ్రన్ దుస్తులకు సంబంధం లేదంటోంది.

“నాకు మంచి బాడీ ఉంది. కానీ నేను ఓ మంచి సెక్సీ, గ్లామర్ డ్రెస్ వేసుకుంటే ట్రోల్ చేస్తారు. అదే ఓ అమ్మాయి వేసుకుంటే తనను ట్రోల్ చేయరు. ఎందుకంటే ఆమెకింకా పెళ్లి కాలేదు కదా. ఆమె అందుబాటులోకి వస్తుందేమో అనే ఫీలింగ్ లో అంతా ఉంటారు. నీ గర్ల్ ఫ్రెండ్, నీ వైఫ్ తప్ప ఇంకెవ్వరూ నీకు ఎవైలబుల్ ఉండరు అనే బుద్ధి వీళ్లకు ఎప్పుడొస్తుందో.”

తెలుగమ్మాయిలు వెస్ట్రన్ లుక్ లో కనిపిస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది అనసూయ. తనకు మోడ్రన్ గా, గ్లామరస్ గా ఉండడమే ఇష్టం అంటోంది.

“నేను వెస్ట్రన్ అమ్మాయిలా కనిపిస్తే తప్పేంటి. అయినా వెస్ట్రన్ గర్ల్స్ మాత్రమే స్టయిల్ గా ఉంటారా.. మనం ఉండమా. నన్ను చాలామంది ఒక మాట అడుగుతుంటారు. నువ్వు తెలుగమ్మాయిలా కనిపించవు, నార్త్ అమ్మాయిలా ఉంటావ్ అంటుంటారు. అంటే తెలుగమ్మాయిలు స్టయిలిష్ గా ఉండకూడదా.”

రీసెంట్ గా మేకోవర్ అయింది అనసూయ. హెయిర్ స్టయిల్ పూర్తిగా మార్చేసింది. అల్ట్రా మోడ్రన్ లుక్ లోకి మారిపోయింది. దీనిపై ఓ నెటిజన్ వేసిన సిల్లీ క్వశ్చన్ కు అనసూయ ఇలా సీరియస్ గా రెస్పాండ్ అయింది. 

ఆర్జీవీ పవర్ స్టార్ స్పెషల్ ఇంటర్వ్యూ