పరాన్నజీవి పాట ఇదేనా?

దర్శకుడు ఆర్జీవీ తీస్తున్న పవర్ స్టార్ కు కౌంటర్ అన్నట్లుగా పవన్ ఫ్యాన్స్ తీస్తున్న సినిమా పరాన్నజీవి. తొలిసారి ఆర్జీవీ మీద ఫుల్ అటాక్ మోడ్ లో తయారవుతున్న సినిమా అని టాక్. బిగ్…

దర్శకుడు ఆర్జీవీ తీస్తున్న పవర్ స్టార్ కు కౌంటర్ అన్నట్లుగా పవన్ ఫ్యాన్స్ తీస్తున్న సినిమా పరాన్నజీవి. తొలిసారి ఆర్జీవీ మీద ఫుల్ అటాక్ మోడ్ లో తయారవుతున్న సినిమా అని టాక్. బిగ్ బాస్ ఎంట్రీ నూతన్ నాయుడు స్వయంగా దర్శకత్వం వహిస్తూ, నిర్మిస్తున్న ఈ సినిమా డే అండ్ నైట్ షూటింగ్ జరుపుకుంటోంది. టైమ్ తక్కువ వుండడంతో శరవేగంతో షూట్ చేస్తున్నారు. శ్రీరెడ్డి ఓ కీలకపాత్రలో నటిస్తున్నట్లు బోగట్టా. 

ఇదిలా వుంటే ఈ సినిమాలో ఇప్పటికే ఓ పాట బయటకు వచ్చింది. జీవీ..జీవి..పరాన్నజీవి అన్న పాట బయటకు వచ్చింది. రెండో పాట ఇంకా విడుదల చేయని పాట ఒకటి బయటకు లీక్ అయింది. ఆ పాట ఇలా సాగింది. ఇది మరి సినిమాలో వుంటుందో, వుండదో తెలియాల్సి వుంది.
……
ఎవడన్నాడు నేను మనిషినని
కడుపుకు తినేది అన్నమని
ఉన్మాదం నా ఊరు, ఊసరవెల్లి నా పేరు
గూడు పుఠాని గుంటనక్కని
పబ్లిసిటీ పిచ్చి కుక్కని
కులం ఆటలో, ధనం వేటలో సిగ్గువదిలిన కీలు బొమ్మనీ
తెరవెనుక ఎవరో ఆడిస్తుంటే ఆడుతున్న ఓ తోలు బొమ్మనీ
….
సినిమా నాకు వ్యాపారం
చీకటి గదిలో వ్యవహారం
ఒక్క చాన్స్ కావాలన్నా
ఆడపిల్ల నాకు ఆహారం
బ్లాకుమెయిలుతో బెదిరించేస్తా
బద్నాం చేసే సినిమా  తీస్తా
నోరు తెరిస్తే అబద్దం
నా బుర్ర నిండా అశుద్దం
…..
బుద్ది పూసలా బిల్డప్పు
వోడ్కాతోటే వేకప్పు
క్లబ్బులోన, పబ్బులోన
డే అండ్ నైట్ లాకప్పు
ఈడ్చి తన్నింది బాలీవుడ్డు
టాలీవుడ్డే బెడ్డు, ఫుడ్డు
కోవిడ్ కన్నా కంత్రీ నేను
మెడిసిన్ లేని డిసీజు నేను….