ఒక్క సినిమా హిట్ కొడితే చాలు హీరోలు, హీరోయిన్ల ఆటిట్యూడ్ లో మార్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే వినిపిస్తూంది ఇద్దరి విషయంలో. కార్తికేయ 2 తో మంచి హిట్ కొట్టిన అనుపమ విషయంలో. డిఙె టిల్లుతో బ్లాక్ బస్టర్ కొట్టిన సిద్దు ఙొన్నలగడ్డ విషయంలో. ఈ ఇద్దరి విషయంలో చాలా మార్పు వచ్చిందని టాలీవుడ్ లో బలంగానే వినిపిస్తోంది. అయితే వీటి విషయంలో వచ్చిన మార్పులతో టాలీవుడ్ కు ఏం సంబంధం అని అడగొచ్చు. కానీ అది వేరే సంగతి.
సిద్దు విషయంలో కొత్త మార్పు వచ్చిందని డిఙెటిల్లు నిర్మాణ వర్గాలే అంగీకరిస్తున్నాయి. డిఙెటిల్లు ముందు బుట్టబొమ్మలో హీరోగా ఓకె చేసాడు. తరువాత క్యాన్సిల్ చేసాడు. అలాగే డిఙె టిల్లు 2 విషయంలో ఒక పద్దతిగా ముందుకు వెళ్లడం లేదు. హీరోయిన్ విషయంలో ఇప్పటికి ఒకటికి రెండు సార్లు మార్పులు ఙరిగాయి. లేటెస్ట్ గా అనుపమ పరమేశ్వరన్ ను కూడా బయటకు పంపేసినట్లే. దీనికి సిద్దునే కారణం అని టాక్ వినిపిస్తోంది. ప్రేమమ్ హీరోయిన్ మడోన్నా సెబాస్టియన్ ను తీసుకుంటున్నారు.
సిద్దు కు తోడు అనుపమ వైఖరి కూడా అలాగే వుందని, డేట్ ల విషయంలో క్లారిటీగా లేదని, దాంతో మార్చేస్తున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. అనుపమ విషయంలో ఇలాంటి కామెంట్లు మొదటి నుంచీ వున్నాయి. అందువల్లే తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి చాన్నాళ్లు అయినా కెరీర్ ఏమీ అద్భుతంగా సాగడం లేదు. కార్తికేయ 2 హిట్ తరువాత 18 పేఙీస్ సినిమా చేస్తోంది అనుపమ.
మొత్తం మీద ఎదిగిన కొద్దీ ఒదిగి వుండాలన్న సూత్రం సినిమా హీరో హీరోయిన్లకు వంటపట్టదేమో?