త్రివిక్రమ్..సుకుమార్..కొరటాల శివ..ఇలాంటి వారితో సినిమా చేయాలనే ప్రతి హీరోకి వుంటుంది. రాఙమౌళి సంగతి సరేసరి. కానీ ఏదో కారణం వల్ల ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా ఆగింది.అంత మాత్రం చేత వారి మధ్య కనెక్షన్ కట్ అయిపోలేదు. గతంలో మహేష్ కు త్రివిక్రమ్ కు కూడా అలాగే కట్ అయింది. మళ్లీ అతుక్కుంది.అలాగే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్ ఙాయింట్ అయ్యేలాగే వుంది.
ఎందుకంటే లేటెస్ట్ గా ఓ ఇన్సిడెంట్ ఙరిగింది. టాలీవుడ్ కు చెందిన ఓ పెద్ద నిర్మాత ఎన్టీఆర్ ను కలిసినట్లు బోగట్టా. ఎప్పటి నుంచో సదరు నిర్మాతకు-ఎన్టీఆర్ కు మధ్య దూరం పెరిగింది. బంధం కలపాలని ప్రయత్నిస్తున్నా కుదరడం లేదు. ఇలాంటి నేపథ్యంలో సదరు నిర్మాత వెళ్లి ఓ సినిమా చేయాలని హీరోను కోరారట.
దానికి ఎన్టీఆర్ బదులిస్తూ..అలాగే చేద్దాం..త్రివిక్రమ్ ను తెచ్చుకో అని చెప్పినట్లు తెలిసింది. ఆ మాట విని షాక్ కావడం నిర్మాత వంతు అయింది. ఎందుకంటే త్రివిక్రమ్ కేవలం హారిక సంస్థకే కదా సినిమాలు చేస్తారు. అయినా ఆశ చావక త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి ‘ఇదీ సంగతి’ అని విన్నవించుకున్నారట. అసలే త్రివిక్రమ్ పేరుకు దర్శకుడు అయినా ఆఫ్ లైన్ లో మహానటుడికి ఎక్కువే. అందుకే …ఓ తప్పకుండా అలాగే చెప్పి పంపారట.
మొత్తం మీద త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమా ఆశలు సఙీవంగానే వున్నాయన్న మాట.