ఇద్దరు కాపుల మధ్య నలిగిపోతున్న రాజు రెడ్డి

పాపం దిల్ రాజు కష్టం పగవాడికి కూడా వద్దు. అడకత్తెరలో పోకచెక్క అంటాం కదా, ఆ టైపులో నలిగిపోతున్నాడు మనోడు. అది కూడా పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా. కెమెరా ముందు దొరికిపోతున్నాడు. Advertisement మింగలేక-కక్కలేక…

పాపం దిల్ రాజు కష్టం పగవాడికి కూడా వద్దు. అడకత్తెరలో పోకచెక్క అంటాం కదా, ఆ టైపులో నలిగిపోతున్నాడు మనోడు. అది కూడా పరోక్షంగా కాదు, ప్రత్యక్షంగా. కెమెరా ముందు దొరికిపోతున్నాడు.

మింగలేక-కక్కలేక అష్టకష్టాలు పడుతున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఆయన నవ్వు చూస్తే, హాలాహలం మింగిన పరమశివుడు గుర్తొచ్చినా తప్పులేదు.

సరిగ్గా 3 రోజుల కిందట ''రాజు రెడ్డి''

సరిగ్గా 3 రోజుల కిందట దిల్ రాజు కాస్తా దిల్ రాజు రెడ్డి అయ్యారు. సాక్ష్యాత్తూ కొత్త దేవుడు పవన్ కల్యాణ్ ఆయనకు కులం తోక తగలించారు. ఓ సినిమా ఫంక్షన్ లో స్టేజ్ పై పవన్ కల్యాణ్, ఆయన ముందు దిల్ రాజు. 

వైసీపీ ప్రభుత్వాన్ని ఆయన తిడుకుంటే దిల్ రాజు తనలోతాను నవ్వుకున్నారు. కొన్ని సందర్భాల్లో  పక్కనే ఉన్న హరీష్ శంకర్ తో కలిసి గట్టిగానే నవ్వారు. అలా అక్కడ పవన్ మనిషిలా వ్యవహరించారు దిల్ రాజు రెడ్డి.

కట్ చేస్తే, అప్పుడలా నవ్వడం ఎన్ని చిక్కులు తెచ్చిపెట్టిందో తర్వాత దిల్ రాజు రెడ్డికి అర్థమైంది. పురాణాల్లో మయసభలో ద్రౌపది నవ్వినందుకే మహాభారత యుద్ధం వచ్చిందంటారు. అలా ఇప్పుడు దిల్ రాజు నవ్వినందుకే అసలు వివాదం కొసర్లో రాజుకుందంటున్నారు చాలామంది. మరి చల్లార్చే బాధ్యత తీసుకోవాలి కదా. సరిగ్గా మరోసారి దొరికిపోయారు దిల్ రాజు.

పేర్ని నాని సమక్షంలో మరోసారి కెమెరాకి..

కొంతమందితో కలిసి మంత్రి పేర్ని నానిని కలవడానికి వెళ్లారు దిల్ రాజు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఇండస్ట్రీకి సంబంధం లేదని, తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసే ప్రయత్నం చేశారు. ఈసారి పేర్ని నాని కూడా మీడియా సమావేశం పెట్టారు. 

పవన్ కల్యాణ్ ను చెడుగుడు ఆడుకున్నారు. కిరాయి కోసం పవన్ కల్యాణ్ పార్టీ పెట్టారంటూ ఓ ఆట ఆడుకున్నారు.

ఓవైపు నాని, పవన్ ను ఆడుకుంటుంటే పక్కనే ఉన్నారు దిల్ రాజు. ఆయన ముఖంలో నెత్తురు చుక్క లేదు. గతంలో పవన్ కల్యాణ్, వైసీపీ నేతల్ని తిట్టినప్పుడు అక్కడే ఉన్నారు దిల్ రాజు. 

ఇప్పుడు వైసీపీ మంత్రి పవన్ ను తిడుతున్న టైమ్ లో కూడా పక్కనే ఉన్నారు దిల్ రాజు. నవ్వితే పవన్ ఫ్యాన్స్ కు కోపం. నవ్వకుండా సీరియస్ గా ఉంటే వైసీపీకి వ్యతిరేకం అనే ఫీలింగ్ వస్తుందేమోనని భయం. దీంతో ముఖంలో ఒక రకమైన ఎక్స్ ప్రెషన్. దాన్ని వర్ణించడం భగవంతుడి వల్ల కూడా కాదు. 

అసలు సమస్య ఏంటి? వివాదం ఎక్కడ మొదలైంది? మధ్యలో తను ఎందుకు ఇలా కెమెరా సాక్షిగా ఇరుక్కున్నానా అని తెగ మధనపడుతున్న మిక్స్ డ్ ఫీలింగ్ దిల్ రాజుది.

ప్రస్తుతం దిల్ రాజు రెడ్డి గారు పడుతున్న బాధ, పగవాడికి కూడా వద్దంటూ సరదాగా మాట్లాడుకుంటున్నారు ఇండస్ట్రీ జనాలు. సన్నాసి, వెధవన్నర వెధవ పదాల మధ్య మౌనమే మన దిల్ రాజు రెడ్డి.