దిల్ రాజును ఆడేసుకుంటున్నారు

అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. ఓవర్ యాక్షన్ ఎప్పడూ వికటిస్తుంది. వకీల్ సాబ్ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఆ సినిమాకు వీలయినంత ప్రమోషన్ చేయచ్చు. తప్పులేదు. కానీ మరీ తనేదో యూత్ అన్నట్లుగా,…

అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. ఓవర్ యాక్షన్ ఎప్పడూ వికటిస్తుంది. వకీల్ సాబ్ సినిమాకు దిల్ రాజు నిర్మాత. ఆ సినిమాకు వీలయినంత ప్రమోషన్ చేయచ్చు. తప్పులేదు. కానీ మరీ తనేదో యూత్ అన్నట్లుగా, ఫ్యాన్ అన్నట్లుగా థియేటర్లో కూర్చుని చింపిన కాగితాల బస్తా దగ్గర పెట్టుకుని గాల్లోకి ఎగరేస్తూ, విడియోలు తీయించుకుని నానా హడావుడి చేసారు. 

ఇండస్ట్రీలో అందరివాడు అనిపించుకోవాలి కానీ కొందరివాడు అని కాదు. ఎంతో మంది హీరోలతో సినిమాలు తీసారు దిల్ రాజు. కానీ ఎప్పుడూ ఇలా కనెక్ట్ అయిపోలేదు. వకీల్ సాబ్ ఉదంతంతోనే వైకాపా అధిష్టానానికి దిల్ రాజు కు మధ్య దూరం పెరిగింది. దిల్ రాజు కు రాయలసీమలో వైకాపా నేతలతో బంధుత్వం వుంది. అయినా కూడా దిల్ రాజును వైకాపా అధిష్టానం దూరం పెట్టడం మొదలయింది.

ఇలాంటి నేపథ్యంలో రిపబ్లిక్ ఫంక్షన్ మరింత ఆజ్యం పోసింది. పవన్ కళ్యాణ్ నేరుగా వైకాపా ప్రభుత్వాన్ని, జగన్ ను టార్గెట్ చేసి ప్రసంగిస్తుంటే పడి పడి నవ్వారు. పైగా ఆయనకు అటు ఇటు వున్న డైరక్టర్, రచయితలు ఇంకా ఎక్కువ చేసారు. దీంతో వైకాపా దగ్గరకు కంటెంట్ అంతా వెళ్లిపోయింది.

దాంతో యువి వంశీ రంగంలోకి దిగి, దిల్ రాజును మంత్రి పేర్ని దగ్గరకు తీసుకెళ్లి డ్యామేజ్ కంట్రోలుకు ట్రయ్ చేసారు. మంత్రి ఏకంగా దిల్ రాజునే పక్కన పెట్టుకుని, పవన్ మీద విమర్శలు ప్రారంభించారు. కక్కలేక, మింగలేక అన్నట్లు అయింది దిల్ రాజు పరిస్థితి.

ఇప్పుడు ఏమయింది. సోషల్ మీడియాలో యాంటీ పవన్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ ఇద్దరూ దిల్ రాజును ఓ లెక్కలో వేసుకుంటున్నారు. కాగితాలు ఎగరేస్తున్న పాత విడియోలు షేర్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. అందుకే ఎప్పడూ ఎగస్ట్రాలు చేసే పరిస్థితి తెచ్చుకోకూడదు.